Nara Lokesh : నారా లోకేష్ కామెడీ.. మార్చి 13న ఓటెయ్యండ‌ని చెప్పి మ‌ళ్లీ దొరికిపోయాడుగా..!

Nara Lokesh : ఈ సారి ఏపీ ఎన్నిక‌లు చాలా రంజుగా మారాయి. ఒక‌వైపు వైసీపీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా, మ‌రోవైపు కూట‌మి అధికారం చేజిక్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఈ క్ర‌మంలో ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇక లోకేష్ తిరిగి యువ‌గ‌ళం పాద‌యాత్ర చేప‌ట్ట‌గా, ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ నాయ‌కుల‌పై నిప్పులు చెరుగుతున్నారు. సీఎం జగన్‌ రెడ్డి చేసిన తప్పులకు వదిలిపెట్టమని…చట్టపరిధిలో చర్యలు తప్పవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల యువగళం సభలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోనని ఉద్ఘాటించారు. మేలుకో ఆంధ్రుడా… ఎన్నాళ్లీ కుల, మతాలపేరుతో కుంపట్లు అని ప్రశ్నించారు. యూనిఫైడ్ పోర్టల్, జాబ్ నోటిఫికేషన్‌తో ఉద్యోగాలు భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. ముస్లింలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని… గుండెల్లో పెట్టుకుంటామని మాటిచ్చారు. 2014-19 మధ్య రూ.1500కోట్లతో నంద్యాలను అభివృద్ధి చేశామని వివరించారు. తమ హయాంలో 10వేల టిడ్కో ఇళ్లు కట్టించామని.. అయినా 2019 ఎన్నికల్లో సండే ఎమ్మెల్యేని గెలిపించారని విమర్శలు గుప్పించారు. జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఫైర్ అయ్యారు.ప్రశాంతతకు మారుపేరైన నంద్యాలలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 15 హత్యలు జరిగాయని మండిపడ్డారు. కానిస్టేబుల్ సురేంద్రను తరిమి తరిమి చంపారని హెచ్చరించారు.

Nara Lokesh again comedy says that on to do that
Nara Lokesh

అయితే తిరుప‌తి జిల్లాల‌లోని చంద్ర‌గిరి స‌మీపంలో ఉన్న అద‌రాల యువ‌గ‌ళం స‌భ‌లో నారా లోకేష్ మ‌ళ్లీ పప్పులో కాలేయ‌డ చర్చ‌నీయాంశం అయింది. లోకేష్ ఎప్పుడు త‌ప్పులో కాలేస్తాడా అని వైసీపీ శ్రేణులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో మ‌రోసారి దొరికాడు. మార్చి 13న ఓటేయాలంటూ నారా లోకేష్ పిలుపునివ్వ‌డంతో ఎన్నిక‌లు మే 13న అయితే మార్చి 13న అంటావేంటి.. మ‌ళ్లీ దొరికిపోయావుగా.. ఎన్నిక‌ల తేదీనే తెలియ‌క‌పోతే ఇంకా ఎలా గెలుస్తావు అంటూ అత‌నిని తెగ ట్రోల్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago