Anchor Shyamala : ప‌వ‌న్ కళ్యాణ్‌ని గుంట న‌క్క‌తో పోల్చుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన యాంక‌ర్ శ్యామ‌ల‌

Anchor Shyamala : ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. మే 13న ఎన్నిక‌లు కాబ‌ట్టి వీలైనంత జోరుగా ఈ లోపు ప్ర‌చారాలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా కూటమి పార్టీ వాళ్ళు సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలను తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ హైపర్ ఆది, హీరోయిన్ నమిత, వైష్ణ‌వ్ తేజ్, సుడిగాలి సుధీర్,వ‌రుణ్ తేజ్, గెట‌ప్ శీను వంటి వాళ్ళు కూటమికి మద్దతుగా నిలబడి ప్రచారం చేస్తున్నారు. పవన్ ని పిఠాపురంలో గెలిపించడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంత మంది వచ్చినా పిఠాపురంలో వంగా గీతను ఓడించలేరని యాంకర్, సినీ నటి, వైసీపీ నాయకురాలు శ్యామల కామెంట్స్ చేశారు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పరువు పోగొట్టుకున్న పవన్ కళ్యాణ్‌ని ఈసారి గెలిపించి పరువు దక్కించడానికి సెలబ్రిటీలంతా ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఇక సీఎం జగన్ అయితే సింహం సింగిల్‌గానే వస్తుందన్నట్టుగా.. పొత్తు పార్టీల్ని గట్టిగానే ఢీ కొడుతూ.. ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లోనే వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసి.. ఆ పార్టీ నాయకురాలిగా వైసీపీ కండువా కప్పుకున్న యాంకర్ శ్యామల.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు ‘కుందేలు’ కథ చెప్పి గట్టిగానే చురకలేసింది. ఇక్కడ ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను.. ఈ గుంటనక్క ఎవరనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నా. నేను చెప్పేది ఒక్కటే.. సరిగ్గా ఆలోచించండి.. సరైన నిర్ణయం తీసుకోండి. వాళ్లు చెప్పే మాటల్ని నమ్మొద్దు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. ఈ గుంటనక్క, తోడేలు మాటల్ని వినొద్దు. 2019 మేనిఫేస్టో.. 2014 మేనిఫేస్టో చేత్తో పట్టుకుని తిరుగుతున్నారు సీఎం జగన్.

Anchor Shyamala sensational comments on pawan kalyan
Anchor Shyamala

పిఠాపురంలో వంగా గీత గెలుపు ఆల్రెడీ ఎప్పుడో ఖాయం అయిపోయిందని అన్నారు. తాను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవ్వడానికి.. వంగా గీతను కలవడానికి కారణం.. భారీ మెజారిటీతో గెలిపించడం కోసమే అని శ్యామల అన్నారు. ఎందుకంటే గెలిచేది వంగా గీతనే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. కూటమి అన్నారు, మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. కానీ అందులో బీజేపీ పెద్దన్న మోదీ ఫోటో లేదని.. మాకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ వాళ్ళు చెప్పడం జరిగిందని.. అదే కూటమికి మైనస్ అని శ్యామల కామెంట్స్ చేశారు. ఇవాళ ఒక న్యూస్ పేపర్ చూసుకుంటే.. అందులో కేవలం ఒకరి ఫోటో మాత్రమే ఉందని.. మిగతా ఇద్దరి ఫోటోల్లో కూడా ఒకరి ఫోటో లేదని.. అక్కడ ఇంకో మైనస్ అని అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago