Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Kodali Nani : చంద్రబాబు,లోకేష్ త్వ‌ర‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ కాళ్లు ప‌ట్టుకోవ‌డం ఖాయం.. ఓ రేంజ్‌లో మాట్లాడిన నాని

Shreyan Ch by Shreyan Ch
May 6, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Kodali Nani : ఏపీలో ఎన్నికల కౌంట్ డౌన్ దగ్గ‌ర‌ప‌డుతుంది. నేతులు ఎండ‌ల‌ని సైతం లెక్క‌చేయ‌కుండా ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనుండ‌డంతో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ఏపీలో ప్రచారానికి వస్తున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ వరుస సభలతో ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో గుడివాడ నుంచి పోటీలో ఉన్న వైసీపీ నేత కొడాలి నాని ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రీ ఎంట్రీ..పార్టీ నాయకత్వం చేపట్టటం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావాలంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులంతా కష్టపడి గెలిపిస్తే.. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తారని అన్నారు.

చంద్రబాబు కొడుకు లోకేష్ ను అధికారంలో కూర్చోబెడతారని.. అందుకే ఎన్టీఆర్ అభిమానులు గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు నాని. టీడీపీని ఓడించి, తన ఫ్రెండ్ ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తానని కొడాలి నాని శపథం చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పగ్గాలు పట్టుకుంటేనే, అతడి అభిమానులు టీడీపీకి మద్దతివ్వాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పగ్గాలు ఎన్టీఆర్ కు రావాలంటే చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలన్నారు. చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్ల కోసం ఎగబడుతున్నారని ఆరోపించారు నాని. పెద్ద ఎన్టీఆర్ ను దుర్మార్గుడని, తెలుగుదేశం పార్టీకి పనికిరాడని మెడ పట్టి బయటకు గెంటి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని, టీడీపీ పగ్గాలు అప్పగించేలా ఫ్యాన్స్ బుద్ధిచెప్పాలన్నాడు.

Kodali Nani sensational comments on nara lokesh and chadra babu
Kodali Nani

జూనియర్ ఎన్టీఆర్ ను సోషల్ మీడియాలో చంద్రబాబు తిట్టించాడని.. తన సభల్లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కనిపిస్తే, ఫ్యాన్స్ ను తన్నితరిమేశారన్నారు. తనకు ఎన్టీఆర్ రాజకీయంగా జన్మనిచ్చారని ఎక్కడైనా ధైర్యంగా చెబుతానన్నారు.తాను పెద్ద ఎన్టీఆర్‌కు భక్తుడినని.. నందమూరి హరికృష్ణ తనకు గురువని చెప్పుకొచ్చారు. 10 మంది జూ.ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకుని టీడీపీ కార్యక్రమాలకు వెళ్తే.. ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేశారని గుర్తు చేశారు నాని. తాను తిరిగే కారుకు ఎన్టీఆర్, వైఎస్సార్‌ రెండు ఫోటోలు పెట్టుకొని ధైర్యంగా తిరుగుతానన్నారు. తెలుగుదేశం పార్టీ గౌడ, యాదవ, మత్స్యకార, ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించిందని.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించలేదన్నారు. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ..ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో మెజార్టీ స్థానాలు వారికే కేటాయించారని గుర్తు చేశారు.

Tags: Kodali Nani
Previous Post

Nara Lokesh : నారా లోకేష్ కామెడీ.. మార్చి 13న ఓటెయ్యండ‌ని చెప్పి మ‌ళ్లీ దొరికిపోయాడుగా..!

Next Post

Geetu Royal : ఈమె ప‌రిస్థితి చూశాకైన స‌రే యువ‌త ఆ అల‌వాట్లు మానుకోపోతే డేంజ‌రే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

చేపలు ఎక్కువగా తింటే.. వ్యాధులతో మరణించే అవకాశాలు తక్కువే..!

by editor
July 16, 2022

...

Read moreDetails
ఆహారం

ఆలయాల్లో అందించే ప్రసాదంలా పులిహోర రావాలంటే.. ఇలా తయారు చేయాలి..!

by editor
July 16, 2022

...

Read moreDetails
ఆధ్యాత్మికం

లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. సిరి సంపదలు కలుగుతాయి..!

by editor
July 16, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.