KGF Malavika Avinash : కన్నడ స్టార్ యష్ హీరోగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ కేజీఎఫ్. రెండు సిరీస్‌లుగా ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది, అయితే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్‌ను కూడా ప్రజలు మరిచిపోలేరు. అంతలా మూవీని అందంగా తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. అయితే ఇందులో నటించిన మాళవిక అవినాష్ దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె జీవితంలో విషాదం ఉంది. మాళవిక కుమారుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి కారణంగా 20 ఏళ్ల వయసులోనూ చిన్న పిల్లాడిలా కనిపిస్తాడట.
ప్రస్తుతం అతను వీల్ చైర్‌కి పరిమితం అయినట్టు తెలుస్తుంది. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి ఉంది. తన కుమారుడి పరిస్థితిపై మాళవిక ప్రతి నిత్యం కుమిళిపోతూ ఉంటారు. దేవుడా ఎందుకు నాకిలాంటి శిక్ష వేశావు అంటూ ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. తాజగా, ఓ టీవీ షోలో ఆమె తన కుమారుడి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఓ షోకు ఆమె తన కుమారుడ్ని తీసుకు రాగా, ఆయన గురించి చెప్పుకొచ్చింది.. ‘‘ నా కుమారుడు ఓల్ఫ్ హెర్షన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి విషయం కొంతకాలం క్రితం తెలిసింది. మొదట్లో ఏ డాక్టరూ దీని గురించి మాకు చెప్పలేదు. ఈ వ్యాధి ఉంటే బుద్ధిమాంధ్యం వస్తుంది. మాట్లాడలేరు.
డాక్టర్స్ నాతో మీరు చాలా దురదృష్టవంతులు అని అన్నారు. పుట్టినప్పటినుంచి అతడు అందరిలా లేడు. అతడ్ని చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా కామెంట్ చేసేవారు అని చెప్పుకొచ్చింది. 2018లో అతడి ఆరోగ్యం తీవ్రంగా విషమించగా, దాదాపు 50రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతాడేమో అని బాధపడ్డాం. కానీ, బతికాడు. ఇప్పుడు అతడ్ని కేర్ టేకర్ చూసుకుంటుంది’’అంటూ ఆవేదన వ్యక్తం చేసింది కేజీఎఫ్ భామ. ఈ అమ్మడి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…