Keshava Rao : కేటీఆర్ అంత మాట అంటాడా… కోపంతో ఊగిపోయిన కేశ‌వరావు..

Keshava Rao : కే కేశ‌వ‌రావు, క‌డియం శ్రీహ‌రి గ‌త ప‌దేండ్లు పార్టీలో అనేక ప‌ద‌వులు అనుభ‌వించి ఇవాళ పార్టీ నుంచి జారుకున్నార‌ని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. క‌ష్ట‌కాలంలో బీఆర్ఎస్ పార్టీకి అండ‌గా ఉంటాన‌ని చెప్పి ఇవాళ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముందుకు వ‌చ్చారు. అవ‌కాశం ఇస్తే చేవెళ్ల‌లో నేను నిల‌బ‌డుతాన‌ని చెప్పారు. దీంతో కేసీఆర్ ఆయ‌న‌కు అవ‌కాశం క‌ల్పించారు. కాసాని ధీరోదాత్త‌మైన నాయ‌కుడు. బ‌ల‌హీన వ‌ర్గాల ముద్దుబిడ్డ, బ‌డుగుల‌ ఆశాజ్యోతి అని చాలా మంది అనేక ప్ర‌సంగాలు ఇచ్చారు.

క‌ష్ట‌కాలంలో మ‌న కోసం వ‌చ్చిన కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. మ‌న క‌ష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయ‌కులు కే కేశ‌వ‌రావు, క‌డియం శ్రీహ‌రి పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో ధీరోదాత్తంగా నిల‌బ‌డి నేనున్నా అంటూ ముందుకు వ‌చ్చిన నాయ‌కుడిని క‌డుపులో పెట్టుకోవాల్సిన బాద్య‌త మ‌న‌పై ఉంది. చేవెళ్ల‌లో నిల‌బ‌డ్డ‌ది కేసీఆర్.. అనుకొని కొట్లాడుదాం. ఆయ‌న కోసం ఓటేస్తాం అనే క‌మిట్‌మెంట్‌తో ప‌ని చేద్దాం. ప‌దేండ్లు ప‌ద‌వులు అనుభ‌వించిన త‌ర్వాత‌.. పోయేవాళ్లు రెండు రాళ్లు వేసి పోతారు. అది వారి విజ్ఞ‌త‌కే వదిలేద్దాం.. కాల‌మే స‌మాధానం చెప్తుంద‌ని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మాట‌ల‌కి స్పందించిన కేశ‌వ‌రావు.. 85 ఏళ్లున్న తాను 55 ఏళ్లు కాంగ్రెస్‌లో పని చేశానని అన్నారు. సీడబ్య్లూసీ మెంబర్‌గా, నాలుగు రాష్ట్రాల ఇన్‌చార్జిగా కాంగ్రెస్ తనకు చాలా ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు.

Keshava Rao sensational comments on ktr
Keshava Rao

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కొంత ఆలస్యం చేయడం వల్ల ఆ పార్టీతో తనకు కొంత తేడా వచ్చిందని కేశవరావు చెప్పారు. తన కొడుకు విప్లవ కుమార్ కోరిక మేరకు ఆనాడు టీఆర్ఎస్‌లో చేరినట్లు చెప్పారు. చాలా బాధతో తాను ఆనాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని అన్నారు. పాటలు, ధర్నాల వల్లనో తెలంగాణ రాలేదన్నారు. పార్లమెంట్‌లో ఫైట్ చేయడం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కారణం తెలుసుకోని.. పార్టీని సరి చేసుకోవాలని చెప్పారు. ఆయన కుటుంబం పార్టీని నడుపుతుందన్న మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని దెబ్బతీసిందని చెప్పారు. యువకులను ముందు పెట్టీ బీఆర్ఎస్ పార్టీని నడిపించాలని చెప్పారు. 13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత తాను తిరిగి సొంత ఇంటికి చేరుకునే సమయం వచ్చిందని వివరించారు. తన కూతురు రేపు(శనివారం) కాంగ్రెస్‌లో చేరుతున్నారని కేశవరావు ప్రకటించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago