KCR : కేసీఆర్‌కి షాకుల మీద షాకులు.. ఎందుకు ఇలా అవుతుంది..?

KCR : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం అపర చాణిక్యుడుగా పేరుగాంచిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. న‌మ్మిన వారే అత‌డిని మోసం చేసి వెళుతున్నారు. రాజకీయాలలో అవకాశవాదం తప్ప, విలువలు ఉండవు అనేది కెసిఆర్ కు బాగా తెలుసు. నమ్మి ఎన్నో అవకాశాలు ఇచ్చిన వారు సైతం, పదవులను ఎంజాయ్ చేసిన వారు సైతం, కష్టకాలంలో కేసీఆర్‌ని వ‌దిలేసి వెళుతున్నారు. ప్రస్తుతం లోక్ స‌భ‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో ఉనికి కోసం పోరాటం కనిపిస్తుంది.ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు టికెట్స్ ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు.

బిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతలైన మల్లారెడ్డి, గుత్తాసుఖేందర్ రెడ్డి మాకు టికెట్స్ అక్కరలేదని చెప్పేశారు. రంజిత్ రెడ్డి వంటి మరి కొంతమంది ఎంపీలు మళ్ళీ టికెట్‌ ఇస్తామని చెప్పినా పార్టీకి రాజీనామాలు చేసే కాంగ్రెస్‌, బీజేపీలో చేరిపోయారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌, వైసీపీ, బీజేపీ ఇంకా చాలా పార్టీలు అనేకసార్లు ఎన్నికలలో ఓడిపోయాయి. తెలంగాణలో ఈ పార్టీలను కేసీఆర్‌ నిర్వీర్యం చేశారు కూడా. అయినా ఏ పార్టీకి ఇంత గడ్డు పరిస్థితి రాలేదు. కానీ రెండున్నర దశాబ్ధాల పాటు కంటి సైగతో తెలంగాణను శాశించిన కేసీఆర్‌కు 17 ఎంపీ సీట్లకు 17 మంది అభ్యర్ధులు దొరకడం లేదు. తెలంగాణలో ఏ పార్టీలో అయినా అత్యంత డిమాండ్ ఉండే సీటు మెదక్ ఎంపీ సీటు. కానీ దానికి బిఆర్ఎస్‌ పార్టీలో ఎవరూ ముందుకు రాకపోవడంతో, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామి రెడ్డి పేరు ఖరారు చేశారు.పార్టీలో మరెవరూ ముందుకు రాకపోవడంతో మెదక్ ఎంపీ సీటుని ఆయనకు ఇచ్చారు.

KCR facing big problems what is happening
KCR

సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పార్టీ మారడం పార్టీ పెద్దలను ఆందోళనకి గురి చేస్తోంది. ఆయనపై యాక్షన్ తీసుకోవాలంటూ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. మరోవైపు దానం బాటలోనే ఇంకెంతమంది ఎమ్మేల్యేలు పార్టీని వీడతారో అనే భయం బీఆర్ ఎస్‌లో మొదలైంది.ఎమ్మెల్యేల కదలికలపై బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. అయినా కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, పార్టీ మారుతార‌ని భావిస్తున్న ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేల‌ను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ నుంచితీసుకున్న వారిలో కొంద‌రికి ఏకంగా మంత్రి ప‌ద‌వులు కూడా కేసీఆర్ క‌ట్ట‌బెట్టారు. ఈ పాప‌మే ఇప్పుడు కేసీఆర్‌ను వెంటాడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago