Keerthy Suresh : కీర్తి సురేష్ కోసం వరుడు సిద్ధం.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న స్టార్ హీరోయిన్..?

Keerthy Suresh : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అలాగే కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి సర్కారు వారి పాటతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఫిల్మ్ కెరీర్‌ గురించి కాకుండా వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త ప్రచారంలో ఉంది.

అదేంటంటే.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కబోతోందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కీర్తి సురేష్ కి పెళ్లి చేయాలని పేరెంట్స్ ఫిక్స్ అయ్యారట. కొన్నాళ్లుగా వరుడిని వెతికే పనిలో ఉన్నారట. అన్ని విధాలుగా కీర్తికి జోడైన అబ్బాయిని ఆమె పేరెంట్స్ ఎంపిక చేశారట. అబ్బాయి కీర్తికి కూడా నచ్చడంతో పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పిందట. దీంతో త్వరలో పెళ్లి ప్రకటన రానుంది అంటున్నారు. పెళ్లి అనంతరం సినిమాలు కూడా చేయకూడదనే నిర్ణయం తీసుకుందట.

Keerthy Suresh reportedly getting married very soon
Keerthy Suresh

ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసి సిల్వర్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పేస్తారట. హీరోయిన్ల విషయంలో ఇలాంటి గాసిప్స్‌ రావడం సహజమే. అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ ఇంకా స్పందించలేదు. ఇంక సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ 3 సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ జంటగా మామన్నన్‌ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో న్యాచురల్ స్టార్‌ నాని సరసన దసరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్‌ చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. కెరీర్ మంచి స్వింగ్‌లో ఉండగా కీర్తి పెళ్లికి అంగీకరించిందంటే నమ్మశక్యంగా లేదు కదా!?

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago