Viral Photo : సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగినప్పటి నుంచి సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కి మధ్య దూరం తగ్గిపోయింది. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో త్రోబ్యాక్ ఫోటోస్ క్రేజ్ ఎక్కువైంది. ఏదైనా పండుగ వచ్చినా.. లేదా పుట్టినరోజున గానీ హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో తమ అభిమాన హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలను క్షణాల్లో ఫ్యాన్స్ వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
స్కూల్ డ్రెస్ లో.. రెండు జడలతో ఉన్న ఈ బేబీని గుర్తుపట్టారా? తల్లి ఎత్తుకుంటే పెదాలు లోపలకి పెట్టుకుని ఒక పక్కకి చూస్తుంది. అలానే ఓ కుర్రాడి వీపు మీద కూర్చుని.. నోట్లో వేళ్ళు పెట్టుకుని ఫోటోకి ఫోజుచ్చింది. ఈ చిన్నారి టాలీవుడ్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. సీనియర్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. తన అందం, అభినయంతో నేటికీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా వెలిగిపోతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రియా శరన్.
సౌత్ ఇండియాను దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా ఏలింది శ్రియా సరన్. మంచి నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఆమెను స్టార్ ని చేశాయి. 2001లో విడుదలైన ఇష్టం ఆమె ఫస్ట్ మూవీ. అది హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జున వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. 2002లో విడుదలైన సంతోషం మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది. అదే ఏడాది చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే ఇలా వరుస హిట్స్.. దీంతో తక్కువ కాలంలోనే స్టార్ హోదా తెచ్చిపెట్టాయి. తద్వారా హ్యుజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది. శ్రియ ఇటీవల ఆర్ఆర్ఆర్, గమనం చిత్రాల్లో నటించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…