Karate Kalyani : నేను అలాంటి దాన్ని కాదు.. సినిమాల్లోనే అలా చేస్తా.. క‌రాటే క‌ల్యాణి క‌న్నీటి ప‌ర్యంతం..

Karate Kalyani : క‌రాటే క‌ళ్యాణి న‌టిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. ‘కృష్ణ’ సినిమాలోని ‘బాబీ’ డైలాగ్ తో చాలా ఫేమ‌స్ అయింది క‌రాటే క‌ళ్యాణి. ఇటీవ‌ల ఓ ఛానెల్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన కరాటే క‌ళ్యాణి త‌న జీవితంలో జ‌రిగిన విషాదాలు చెప్పుకొచ్చింది. త‌న భ‌ర్త శాడిస్ట్ అని, చిత్ర హింస‌లు పెట్టాడ‌ని కూడా చెప్పింది. ఇక సినిమాల్లో చేసిన కొన్ని సన్నివేశాలను ప్రస్తావిస్తూ చాలా మంది చులకనగా చూస్తారు. నా క్యారెక్టర్ మీద కూడా కామెంట్లు చేస్తారు. అయితే, బతకడం కోసం అలాంటి క్యారెక్టర్లు సినిమాల్లో చేశాను తప్ప.. తనది అలాంటి క్యారెక్టర్ కాదని చెప్పింది క‌ళ్యాణి.

పెళ్లి త‌ర్వాత నా జీవితంలో చాలా ఇబ్బందులు ప‌డ్డాను. ద్రౌప‌ది వ‌స్త్రాప‌హ‌ర‌ణం కూడా జ‌రిగింది. నేను పెళ్లిచేసుకున్న వ్యక్తి తాగి బేగంపేటలో రోడ్డుపై నా పైట లాగాడు. కొట్లాటలు, తాగి నన్ను కొట్టడం.. ఇవన్నీ చూశాక పెళ్లి నాకు అవసరం లేదు అనిపించింది. భర్తను గౌరవించాలి కాబ‌ట్టి అత‌న్ని బ‌రించాను. రాత్రి 2 గంటలకు తాగేసి వచ్చి వండి పెట్టమన్నా పెట్టేదాన్ని. అవ‌న్నీ చూసి పెళ్లి మీద విసుగు వ‌చ్చింది. అయితే మంచి వ్య‌క్తి దొరికితే రెండో పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పుకొచ్చింది క‌రాటే క‌ళ్యాణి. తండ్రి చనిపోయిన తరవాత తల్లి, చిన్న తమ్ముడితో తాను ఉంటున్నానని.. అయితే, తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే తాను ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయానని చెప్పారు.

Karate Kalyani got emotional about telling her movies
Karate Kalyani

నన్ను చాలా మంది చాలా మాట‌లు అన్నారు. కాని నేను ఎంత క‌ష్ట‌ప‌డి వ‌చ్చానో ఎవ‌రికి తెలియ‌దు. బ‌య‌టి వారు ఒక వ్యభిచారిని అన్నట్టు మాట్లాడతారు. ఏరోజూ నేను అలాంటి పనులు చేయలేదు. నీచమైన మాటలు మాట్లాడితే నాకు లోపల నుంచి ఏడుపు వచ్చేస్తుంది. నన్ను చూసి భయపడేవాళ్లే తప్ప నన్ను అర్థం చేసుకునేవాళ్లు లేరు. సెలబ్రిటీగా ఎంత పేరొస్తే అంతలా నెగిటివిటీ, ట్రోలింగ్స్ కూడా పెరుగుతుంది. ఒక్కోసారి మా అమ్మానాన్నను తిడతారు. నాకు చాలా బాధేస్తుంది. మనం ఉన్న సొసైటీ అలా ఉంది అని కళ్యాణి ఎమోషనల్ అయ్యారు. ఆమె చెప్పిన మాట‌లు విని ప్ర‌తి ఒక్క‌రు భావోద్వేగానికి గుర‌వుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago