Avatar 2 : అవ‌తార్ 2 రికార్డ్ క‌లెక్ష‌న్స్.. 12 రోజుల‌లో ఎన్ని వసూళ్లు రాబ‌ట్టింది అంటే..!

Avatar 2 : 2009లో వచ్చిన ‘అవతార్’ చిత్రం ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 13 ఏళ్ల క్రితమే వందల కోట్లు కలెక్ట్ చేసిన అవ‌తార్ మూవీకి సీక్వెల్ గా ‘అవతార్ 2′(అవతార్ ది వే ఆఫ్ వాటర్) కూడా రాబోతున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ ని మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ మూవీ దాదాపు 350 – 400 మిలియన్ డాలర్లకు పైగా బ‌డ్జెట్తో రూపొంద‌గా, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లొకేషన్లలో రిలీజ్ అయింది.

ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది. విజువల్ వండర్‌గా రూపొందిన ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు వ‌స్తున్నాయి. రెండో వీకెండ్‌లోనూ సత్తా చాటిన ఈ మూవీ.. 12వ రోజైన మంగళవారం కాస్త వెనుకబడింది. అయినప్పటికీ దీనికి రూ. 2.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Avatar 2 collections in 12 days how much it is
Avatar 2

‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’కు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో నైజాంలో రూ. 38.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.58 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 25.17 కోట్లతో కలిపి రూ. 72.53 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది. మొత్తం కలిపి దీనికి రూ. 77.20 కోట్లు వచ్చాయి. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఇది 12 రోజుల్లో రూ. 27.20 కోట్లు లాభాలు సాధించిందని చెప్పాలి. ప్రతి రోజూఈ మూవీ తక్కువలో తక్కువగా రూ. 20 కోట్లు గ్రాస్ వసూలు అవుతుంది. ఇలా 12 రోజుల్లోనే ఈ మూవీకి రూ. 274.05 కోట్లు నెట్‌, రూ. 317.40 కోట్లు గ్రాస్‌ వచ్చింది. ఈ క్ర‌మంలో అవ‌తార్ 2 సినిమా 2022లో టాప్ మూవీగా రికార్డును సాధించింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago