Kanti Chuputho Champesta : టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన బాలయ్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఆ తర్వాత కూడా అంతకుమించి అనేలా ఫ్యాన్స్ ని మెప్పించడం కోసం కృషి చేస్తున్నారు. ఎందుకంటే వేరే హీరోకి లేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాలకృష్ణకు ఉంది. అభిమానులు బాలయ్య సినిమాలలోఎక్కువగా ఇష్టపడేది ఆయన చెప్పే డైలాగులు కోసం. బాలయ్య సినిమా అంటే డైలాగులు మినిమమ్ ఉండాల్సిందే. ఎంత భారీ డైలాగును ఆయినా బాలయ్య సింగిల్ టేక్ లో చెప్పేస్తారు. పౌరాణికం కానీ, మాస్ డైలాగ్ గాని ఇలా ఏ డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్ లో ఓకే అయిపోవాల్సిందే.
బాలయ్య చెప్పే డైలాగులకు థియేటర్స్ డిటిఎస్ మోత మోగిపోతుంటాయి. ముఖ్యంగా బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశాడంటే ఆ సినిమాలో బాంబుల కన్నా డైలాగులే ఎక్కువగా పేలిపోతాయి. బాలయ్య బాబు కెరియర్లో ఇప్పటి వరకూ చెప్పిన డైలాగుల్లో అభిమానులకు ఫేవరెట్ డైలాగులు ఎన్నో ఉన్నాయి. బాలయ్య డైలాగుల్లో నరసింహనాయుడు సినిమాలో చెప్పిన కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ చాలా మంది ఇప్పటికి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ డైలాగ్ ఆయన అభిమానులను అంతగా ఆకట్టుకుంది. నరసింహనాయుడు చిత్రంలో కత్తి కంటే బాలయ్య కంటికి ఉన్న పవర్ ను వివరిస్తూ ఆ డైలాగ్ ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ డైలాగును ఎన్టీఆర్ నిజజీవితంలో చెప్పారన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియని విషయం. నరసింహనాయుడు సినిమాకు మాటల రచయితగా పనిచేసిన పరుచూరి గోపాల కృష్ణ ఈ డైలాగును రాశారు. అంతేకాకుండా పరుచూరి గోపాలకృష్ణనే ఎన్టీఆర్ నటించిన నాదేశం చిత్రానికి కూడా రచయితగా పనిచేశారు. నాదేశం సినిమాలో క్లైమాక్స్ లో ఒకే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అయితే నాదేశం దర్శకుడు బి. బాప్పయ్య మాత్రం మరో ఫైట్ సీన్ పెట్టాలని అనుకున్నారట. కానీ ఆ విషయం ఎన్టీఆర్ కు చెప్పేంత ధైర్య దర్శకుడికి లేక పరుచూరి గోపాలకృష్ణకు ఆ బాధ్యత అప్పగించారట.
ఒక సందర్భంలో కారులో వెళుతున్నప్పుడు అన్నగారూ మీ మాస్ ఇమేజ్ కు తగ్గట్టు మరో ఫైట్ ఉంటే బాగుంటుందని పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ తో చెప్పడం జరిగిందట. దాంతో ఎన్టీఆర్ దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఫైట్ ఉంటే సత్యనారాయణతో చెప్పండి అంతే. నేను గట్టిగా కన్నెర్రచేస్తే వాళ్లు గుండె ఆగి చస్తారు అని అన్నారట ఎన్టీఆర్. పరుచూరి గోపాలకృష్ణ ఈ ఘటనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని 20 ఏళ్ల తరువాత నరసింహనాయుడు సినిమాలో పెట్టారట. ఆ డైలాగే నరసింహనాయుడు చిత్రానికి హైలైట్ గా నిలిచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…