Daddy Movie Child Artist : ప్రముఖ డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన సినిమా డాడీ. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. 2001లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. తండ్రి కూతురి మధ్యనుండే ఎమోషన్ కథాంశంగా రూపొందించిన ఈ సినిమాలో ఐశ్వర్య పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. చిరంజీవి తర్వాత అంతలా ప్రేక్షకులకు దగ్గర అయింది ఆ పాప. ఈ సినిమాలో ఐశ్వర్య, అక్షయలా ద్విపాత్రిభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఆ చిన్నారి అసలు పేరు అనుష్క మల్హోత్రా.
డాడీ సినిమా వచ్చి దాదాపు 22 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ చిన్నారి పాత్ర అందరికి గుర్తుండిపోయింది. తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అనుష్క మల్హొత్రకు డాడీ విజయం తర్వాత సినిమాల కోసం ఆమెకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాలకు అనుష్క గుడ్ బై చెప్పేసింది. డాడీ సినిమా తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై ఎక్కడా కనిపించలేదు. ఈ చిత్రంలో తన మాటలుతో క్యూట్ ఎక్స్ప్రెషన్ తో ఎంతో మందిని ఆకట్టుకున్న చిన్నారి నటనకు విమర్శకులు సైతం మంచి మార్కులు ఇచ్చారు. ఇప్పుడు అనుష్క మల్హోత్రా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పటి ఆ చిన్నారి చిట్టి పాప ఇప్పుడు మరింత గ్లామర్స్ లుక్ తో అందరి మతులను పోగొట్టేస్తుంది.
అనుష్క మల్హోత్రా ప్రస్తుతం యూకేలో ఉంటున్నట్లు సమాచారం. ఆమె చదువుకి ఆటకం కలగకూడదని ఉద్దేశంతో అనుష్క తల్లిదండ్రులు సినిమాలకు దూరంగా ఉంచారట. ఇక అనుష్క తన డిగ్రీని పూర్తి చేసుకొని ఇప్పటికే మోడల్ రంగంలో ప్రవేశించింది. ఇప్పటికే ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులంతా ఇప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనుష్క కూడా కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి ఛాన్స్ కొట్టేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త నిజమైతే ఆనాటి క్యూట్ చిన్నారి అనుష్క హీరోయిన్ గా ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…