Rashmika Mandanna : రష్మిక మందన్న‌కు ఊహించ‌ని షాక్‌.. నిషేధం విధించిన సినీ ప‌రిశ్ర‌మ‌..?

Rashmika Mandanna : క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మందాన త‌న టాలెంట్‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా గుర్తింపు పొందింది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాల‌తో అల‌రించింది.‘కిరిక్ పార్టీ’ అనే సినిమా ద్వారా రష్మిక వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా రక్షిత్ శెట్టి హీరో, నిర్మాత. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే, రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమాయణం, నిశ్చితార్థం, ఆ తరవాత పెళ్లిని రద్దు చేసుకోవడం తెలిసిందే. అయితూ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న ర‌ష్మిక ప్ర‌స్తుతం హిందీలో కూడా సినిమాలు చేస్తుంది.

అయితే ర‌ష్మిక‌ను క‌న్నడ ప‌రిశ్ర‌మ బ్యాన్ చేయ‌బోతుంద‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. కన్నడ సినిమాలను రష్మిక పదేపదే అగౌరవపరచడాన్ని తట్టుకోలేని కర్ణాటకలోని థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ పరిశ్రమ ఆమెపై నిషేధం వేశారని, త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తార‌ని టాక్ న‌డుస్తుంది. కన్నడ సినిమాలను తక్కువ చేసి చూసిందనే విమర్శలు రావ‌డంతో ఆమెను కన్నడిగులు తరచూ ట్రోల్ చేస్తుంటారు.రష్మిక చేసిన కామెంట్స్ కన్నడిగులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి.

kannada movie industry reportedly banned Rashmika Mandanna
Rashmika Mandanna

ర‌ష్మిక‌ని క‌న్న‌డిగులు బ్యాన్ చేస్తే ఆమె నటించిన ‘వారిసు’, ‘పుష్ప 2’ సినిమాలను సైతం కన్నడలో విడుదల కాకుండా అడ్డుకుంటారని జోష్యం చెబుతున్నారు. దీనిలో నిజమెంతుందో తెలీదు కానీ.. రష్మికను టార్గెట్ చేస్తూ నెగిటివ్ ట్వీట్లు అయితే మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీనికి కారణం లేటెస్ట్‌గా రష్మిక మందన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే. తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ గురించి చెబుతూ ఆ సంస్థ పేరును ప్రస్తావించలేదు. అంతేకాకుండా, రెండు చేతులతో ‘సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్’ అనే అర్థమొచ్చేలా సైగలు చేస్తూ చెప్పారు. ఇది కన్నడ సినీ ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago