Rashmi Gautam : బుల్లితెరకి గ్లామర్ అద్దిన అందాల ముద్దుగుమ్మలలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈ అమ్మడు పొట్టి దుస్తులలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తన అందచందాలతో బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా సందడి చేస్తుంది. రష్మీనే కాదు ఈ అమ్మడితో పాటు శ్రీముఖి, అనసూయ, విష్ణుప్రియ, మంజూష, సౌమ్యా రెడ్డి ఇలా చాలా మంది యాంకర్స్ తమ గ్లామర్‌తో కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ మీమర్ ఇప్పుడున్న యాంకర్స్ అందరి ఫోటోలని పెట్టి వీరంతా హీరోయిన్స్ అవ్వాల్సిన వాళ్ళు కానీ హీరోయిన్ ఎలా అవ్వాలో తెలియక యాంకర్స్ గా మిగిలిపోయారనేలా కామెంట్ పెట్టాడు.
తన పోస్ట్ లో శ్రీముఖి, మంజూష, రష్మీ, స్రవంతి, అషురెడ్డి, విష్ణుప్రియ ఉండగా, వీళ్లంతా కూడా ప్రస్తుతం తెలుగులో యాంకరింగ్స్ చేస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తున్న వాళ్ళే. అలాగే వీళ్లంతా సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. కాని హీరోయిన్స్ కావాలని ఆశపడి కుదరక ఉండిపోయిన వాళ్లు అని మీమ్ వేశాడు. ఇది రష్మీ దృష్టికి రావడంతో ఆమె స్పందించారు. సదరు నెటిజెన్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
అవును నిజమే.. కానీ ఇక్కడ ఒక కామన్ పాయింట్ మిస్ అయ్యారు. ఫొటోలో ఉన్న అమ్మాయిలు అందరూ తెలుగు ప్రాంతాల్లో పుట్టారు. అదే ముంబై బోర్డింగ్ పాస్ ఉంటే కథ వేరేలా ఉండేదేమో. అప్పుడు మేము వేసుకున్న బట్టలు ట్రెండ్ సెట్ చేసేవి. ఏదేమైనా ఎంకరేజ్మెంట్ కి ధన్యవాదాలు అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. రష్మీ కామెంట్ వైరల్ గా మారింది. మొత్తానికి ఈ అమ్మడు కూడా తెలుగు అమ్మాయిలకి పరిశ్రమలో గుర్తింపు ఉండదు అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితమే రష్మీ సినీ పరిశ్రమకి హీరోయిన్ అవుదామని వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి చిన్న చిన్న వేషాలు వేస్తూ ఇప్పుడు ఇలా యాంకర్ గా సెటిల్ అయింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…