Kakinada Shyamala : సిల్క్ స్మిత.. ఒకప్పుడు తన అందచందాలతో ఓ ఊపు ఊపింది. మత్తెక్కించే కళ్లు, తనదైన శైలి హావభావాలతో, గ్లామర్‌తో అప్పట్లో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది సిల్క్ స్మిత. ఆమె చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. ఆమె మరణం ఓ మిస్టరీగా మారింది. అయితే తాను ఎలా చనిపోయింది అనే విషయంపై సీనియర్ నటి కాకినాడ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేసింది. కాకినాడ శ్యామల.. నటిగా, నిర్మాతగా, ఫైనాన్షియర్గా తెలుగు, తమిళ చిత్రసీమల్లో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది.
‘మరో చరిత్ర’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కాకినాడ శ్యామల తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు రెండొందలకు పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుండగా, చివరగా 2013లో ‘ఆకాశంలో సగం’ సినిమాలో కనిపించింది. తాజాగా శ్యామల ఓ ఇంటర్వూలో సినిమా విశేషాలను, తన పర్సనల్ లైఫ్ గురించి, అలానే సిల్క్ స్మిత మరణం గురించి కొన్ని విషయాలు వెల్లడించింది. ‘ నేను సిల్క్ స్మిత సొంత సినిమాకు డబ్బులిచ్చాను. అయితే ఆ ఫిల్మ్ సరిగ్గా ఆడకపోవడంతో స్మిత అప్పులుపాలైంది. మొత్తం ఆస్తులన్నీ పోగొట్టుకుంది. నిజానికి స్మిత వెండితెరపై వేసే పాత్రలు వేరు.. రియల్‌లో ఆమె వ్యక్తిత్వం వేరు. ఆమె నిజాయితీ గల మనిషి.. అందరికీ అప్పులు తీర్చేసింది’.
స్మిత కెరీర్ తర్వాత కూడా బాగా సాగింది. కానీ అంతలోనే ఆమె చనిపోయిందని వార్త విన్నాను. కొంతమంది ఆమెను హత్య చేశారని అంటే.. మరికొందరు ఆత్మహత్య చేసుకుందని అన్నారు. అసలు ఏం జరిగిందో ఆపైవాడికే తెలియాలి. ఆమె చనిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియవు’ అని కాకినాడ శ్యామల అన్నారు. ఈరోజు కాకపోయినా ఏరోజైనా శిక్ష అనేది ఉంటుంది. ఆమె ఎందుకు చనిపోయిందనే విషయం తనకు తెలియదు అని కాకినాడ శ్యామల స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…