OTT : ప్రతి వారం ఓటీటీలో పలు చిత్రాలు ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నాయి. గత వారం ‘రావణాసుర’, ‘మీటర్’ సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఈ వారం సైతం పలు పాన్ ఇండియన్ సినిమాలతో పాటు చిన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లలో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఓటీటీ లో అలరించనున్న సినిమాల విషయానికి వస్తే.. దాస్ కా ధమ్కీ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ ఏప్రిల్ 14న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతోంది. నివేదా పేతురాజ్, హైపర్ ఆది, మహేష్, రావు రమేష్, రోహిణి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
మార్చి 22న విడుదలైన ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ‘ఆహా’లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఓ కల అనేది చక్కటి ప్రేమ కథాంశంతో రూపొందగా, ఈ మూవీ ఏప్రిల్ 13 నుంచి నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ కలిసి నటించారు. దీపక్ కొలిపాక దర్శకత్వం వహించారు. ప్రేమ ఉన్నా, ఆ విషయాన్ని చెప్పకపోవడంతో ఎంత నరకం అనుభవించాల్సి ఉంటుందో ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. కన్నడ భాషకి చెందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కబ్జా చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 14 నుండి స్ట్రీమ్ కానుంది.
ఇక రవిబాబు దర్శకత్వంలో రూపొందిన అసలు చిత్రం గురువారం( ఏప్రిల్ 13)న ఓటీటీలో సందడి చేయనుంది. ఈటీవీ విన్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. నటి పూర్ణ లీడ్ రోల్‌లో చేసిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇక ది మార్వెలస్ మిస్సెస్ అనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు రానుంది. రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించిన ‘మిస్సెస్ అండర్‌కవర్’ అనే హిందీ చిత్రం ఏప్రిల్ 14న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…