Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్, ఆమె భర్త, గౌతమ్ కిచ్లు మే 19, 2022న నీల్ కిచ్లు అనే మగబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆమె తన కొడుకు ముఖాన్నిచూపించింది. ఈ ఏప్రిల్‌లో, ఈ జంట తమ కుమారుడు నీల్ మొదటి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది.తాజాగా కొడుకుతో ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది.
ఇటీవల హైదరాబాద్‌కు బయలుదేరిన సమయంలో ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఈ సమయంలో విమానాశ్రయంలో కాజల్ తన కొడుకును ఎత్తుకుని కనిపించింది. దీంతో వీడియో అండ్ ఫొటో గ్రాఫర్స్ వెంటనే ఫొటోలు, వీడియోలను క్లిక్ చేసేందుకు ఛాయాచిత్రకారులు వారి చుట్టూ గుమిగూడారు. కెమెరాలన్నీ ఒక్కసారిగా క్లిక్ చేస్తూ ఉండటంతో నీల్ రియాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. క్యూట్ గా కనిపిస్తోన్న నీల్ కిచ్లూ.. ఫొటోగ్రాఫర్లు తనను క్లిక్ చేసినప్పుడు వారి వైపు చూస్తూ క్యూట్‌గా కనిపించాడు. వీళ్లంతా ఎవరో అని చిన్న కళ్లతో ఆశ్చర్యంగా చూస్తున్నట్టు అనిపించింది. ఈ సమయంలో కాజల్ స్లింగ్ బ్యాగ్‌తో బ్లాక్ డ్రెస్ ధరించగా, ఆమె కొడుకు వైట్ డ్రెస్సులో అందంగా కనిపించాడు.
గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి యాక్టింగ్ తో బిజీ కానుంది. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఫిజిక్ పొందే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా కాజల్ ప్రస్తుతం బాలయ్య సరసన భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా కాజల్ జోరు ఏమాత్రం తగ్గలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…