Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తలలో నిలుస్తున్నారు. ఏ విషయం గురించి అయిన కూడా నిర్మొహమాటంగా మాట్లాడడం వర్మ స్పెషాలిటి. సోలో జీవితం గడుపుతూ తనకు నచ్చినట్టు జీవిస్తున్న వర్మ ఒకసారి ఇంటర్వ్యూలో తన భార్య, కూతురి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన భార్యకి తనకి ఎప్పుడు పెళ్లైంతో తనకు తెలియదని, తనే డైవర్స్ తీసుకుందని, తాను తీసుకోలేదని అన్నాడు వర్మ. ఇక తన కూతురు మెడిసిన్ చేస్తుందనుకుంటా అని చెప్పిన వర్మ తను ఫ్యామిలీ పర్సన్ కాదని పేర్కొన్నాడు. తాను తన కూతురిని మూడు నెలలకో, ఆరు నెలలకో కలుస్తుంటానని చెప్పాడు.
చాలా మంది రాంగోపాల్ వర్మకు పెళ్లి కాలేదని అనుకుంటారు.కాని అది నిజం కాదు. ఆయన భార్య పేరు రత్న… వారివురి దాంపత్యానికి గుర్తుగా రేవతి అనే కూతురు కూడా ఉంది.సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన రత్నది వర్మకి పూర్తి భిన్నమైన మనస్తత్వం. రత్న భర్తనుండి విడిపోయినప్పటికీ రేవతిని పద్ధతిగా పెంచుకున్నారు.రష్యాలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన రేవతి పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఆ పెళ్లి వేడుకలో కూడా తల్లి కూతుర్లు వర్మని గెస్ట్ గానే ట్రీట్ చేశారు.వర్మ భార్య గురించి వార్తలు ఎప్పుడూ రాలేదు కానీ వర్మ కూతురు మాత్రం తండ్రినెప్పుడూ విభేదిస్తునే వస్తుంది.
ఆ మధ్య ఏదో ట్వీట్ విషయంలో కూడా తండ్రిని విభేదించి ఆ ట్వీట్ డిలీట్ చేస్తావా లేదా అని బహిరంగంగానే వెల్లడించింది.వర్మ ప్రవర్తన తెలిసిన ఎవరైనా భార్యభర్తలు ఎందుకు విడిపోయుంటారో అని పెద్దగా కారణాలు వెతుక్కోనక్కర్లేదు.సమాజంలో కొంచెం డిఫరెంట్ ఉండే వర్మకి కుటుంబవాతావరణం పెద్దగా సూట్ కాదని తనే ఎన్నో సార్లు అన్నారు.…అయితే భార్య గురించి వర్మ ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు .కానీ ఈ మధ్య ఓ సందర్భంలో వర్మ మాట్లాడుతూ తనకు మంచి భార్య దొరికింది కాని… తన భార్యకు మాత్రం మంచి భర్త దొరకలేదని వ్యాఖ్యానించాడు.ఈ ఒక్కమాటతోనే చెప్పొచ్చు ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…