Vangaveeti Radha : వంగవీటి రాధా.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విజయవాడ పాలిటిక్స్‌లోనే కాదు.. ఏపీ పాలిటిక్స్‌లో కీలక నేతగా ఉన్న రాధా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా పెళ్ళి చేసుకోనుండగా, బెజవాడ రాజకీయవర్గాల్లో ఇదొక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇంతకీ ఇన్నాళ్ల తరువాత రాధ పెళ్ళి చేసుకోనుంది ఎవరిని అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. వంగవీటి రాధాకృష్ణ త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైంది.
తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లు పేర్కొంటున్నారు. ఈ నెల 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్.. అక్టోబర్లో పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు రాధాకృష్ణ.. ఇక రాధ పెళ్ళి చేసుకోరు అని అనుకున్న వారంతా ఆయన పెళ్ళి వార్త విని ఆశ్చర్యపోతున్నారు. వంగవీటి ఇంటి కోడలు కాబోతున్న అమ్మాయి ఎవరు? ఆమె ఎలా ఉంటారు? అని తెగ ఆరా తీస్తున్నారు అభిమానులు. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి అమ్మాని దంపతుల చిన్న కుమార్తెనే వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. బాజ్జి దంపతలుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి ద్వితీయ పుత్రిక పుష్పవల్లిని రాధాకు ఇచ్చి పెళ్లి చేయనున్నారు. జక్కం అమ్మాని 1987-92 వరకు నరసాపురం మున్సిపాలిటీ టిడిపి చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
పుష్పవల్లి స్కూల్, కాలేజ్ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొంత కాలం హైదరాబాద్‌లో యోగా టీచరుగా చేసిన పుష్పవల్లి.. ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టారు. తండ్రి టిడిపి ఆవిర్భావం నుండి నరసాపురం రాజకీయాలలో కీలక పాత్ర పోషించేవారు. అయితే అనివార్య కారణాలవల్ల కొంతకాలం హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఇటీవలి కాలంలో మళ్ళీ నరసాపురంలో నూతన గృహ నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు. ఇటీవల ఈయన జనసేన పార్టీలో చేరి.. క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురం వచ్చినప్పుడు వీరి ఇంట్లోనే బస చేశారు. ఇటీవల వంగవీటి రంగ జయంతి సందర్భంగా వంగవీటి రాధా వీరి నివాసానికి వచ్చి.. రంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగానే రాధా మిత్రులు వివాహ సంబంధం గురించి ఇరువైపులా పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఖరారైంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…