Kajal Aggarwal : మ‌గ‌ధీర సీక్వెల్‌పై కాజ‌ల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైర‌ల్‌..!

Kajal Aggarwal : ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో మ‌గ‌ధీర చిత్రం ఒక‌టి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో 2009లో మగధీర అనే పిరియాడిక్ సినిమా వచ్చి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రామ్ చరణ్‌కు ఇటు రాజమౌళికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్‌ స్టార్ ఇమేజ్‌ మరింత పెరిగింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌గ‌ధీర‌ చిత్రం మంచి విజ‌యం సాధించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ చరణ్ ను స్టార్ హీరోగా మార్చేసింది.

ఇది పునర్జన్మలతో కూడిన ప్రేమకథే అయినప్పటికీ, రాజులు .. యుద్ధాల నేపథ్యంలో నడిచే కథలను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించగలడనే నమ్మకం అప్పుడే ఆడియన్స్ కి కలిగింది. ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందని అప్పట్లోనే అనుకున్నారు. రాజమౌళి – చరణ్ ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేసినట్టుగా ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ పైనే ఈ ఆలోచన బలపడిందని అంటున్నారు.రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి కమిటైన‌ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత ‘మగధీర’ సీక్వెల్ ఉంటుందని అంటున్నారు.మ‌రి ఇందులో ఎంత క్లారిటీ ఉంద‌నేది తెలియ‌క చాలా మంది డైల‌మాలోనే ఉన్నారు.

Kajal Aggarwal interesting comments on magadheera 2
Kajal Aggarwal

ఇక మ‌గ‌ధీర‌లో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించి కాజ‌ల్ దీనిపై స్పందించింది. అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’ . సుమన్‌ చిక్కాల దర్శకుడు. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంగా సిద్ధమవుతున్న ఈ సినిమాలో కాజల్‌.. సత్యభామగా పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు రానా.. కాజల్‌ను ఇంటర్వ్యూ చేశారు. దీపావళి సందర్భంగా రానా దగ్గుబాటి… కాజల్ అగర్వాల్ నుంచి చాలా విషయాలు రాబట్టాడు. మ‌గ‌ధీర సీక్వెల్ గురించి అడ‌గ‌గా, రాజ‌మౌళి గారు వింటున్నారా అని కాజ‌ల్ స‌మాధానం దాట‌వేశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago