Kajal Aggarwal : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలలో మగధీర చిత్రం ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో 2009లో మగధీర అనే పిరియాడిక్ సినిమా వచ్చి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రామ్ చరణ్‌కు ఇటు రాజమౌళికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. మగధీర చిత్రం మంచి విజయం సాధించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ చరణ్ ను స్టార్ హీరోగా మార్చేసింది.
ఇది పునర్జన్మలతో కూడిన ప్రేమకథే అయినప్పటికీ, రాజులు .. యుద్ధాల నేపథ్యంలో నడిచే కథలను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించగలడనే నమ్మకం అప్పుడే ఆడియన్స్ కి కలిగింది. ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందని అప్పట్లోనే అనుకున్నారు. రాజమౌళి – చరణ్ ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేసినట్టుగా ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ పైనే ఈ ఆలోచన బలపడిందని అంటున్నారు.రామ్ చరణ్, రాజమౌళి కమిటైన ప్రాజెక్టులు పూర్తయిన తరువాత ‘మగధీర’ సీక్వెల్ ఉంటుందని అంటున్నారు.మరి ఇందులో ఎంత క్లారిటీ ఉందనేది తెలియక చాలా మంది డైలమాలోనే ఉన్నారు.

ఇక మగధీరలో రామ్ చరణ్ సరసన నటించి కాజల్ దీనిపై స్పందించింది. అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’ . సుమన్ చిక్కాల దర్శకుడు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా సిద్ధమవుతున్న ఈ సినిమాలో కాజల్.. సత్యభామగా పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు రానా.. కాజల్‌ను ఇంటర్వ్యూ చేశారు. దీపావళి సందర్భంగా రానా దగ్గుబాటి… కాజల్ అగర్వాల్ నుంచి చాలా విషయాలు రాబట్టాడు. మగధీర సీక్వెల్ గురించి అడగగా, రాజమౌళి గారు వింటున్నారా అని కాజల్ సమాధానం దాటవేశారు.