KA Paul : ఎల‌క్ష‌న్ క‌మీషన్ ఆఫీసులో కేఏ పాల్‌ని చూసి త‌ల‌వంచుకొని న‌వ్వేసిన ప‌వ‌న్

KA Paul : వచ్చే ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత, ఓటర్ల జాబితాపై విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.ఈ స‌మావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్ సమీక్షించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటుగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఆప్‌ నేతలు హాజరయ్యారు. కేఏ పాల్ సైతం ఈ స‌మావేశానికి హాజ‌రైన‌ట్టు తెలుస్తుండ‌గా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఆయ‌న ఒక్క‌సారిగా ఎదురు ప‌డ్డారు. ఇక పాల్‌ని చూడ‌గానే పవ‌న్ క‌ళ్యాణ్ తెగ న‌వ్వేసుకున్నార‌ట‌.

ఇక ఇదిలా ఉంటే సమావేశానికి ముందు చంద్రబాబు, పవన్‌ నోవాటెల్‌లో భేటీ అయ్యారు. ఈసీకి నివేదించాల్సిన అంశాలపై వీరిద్దరూ చర్చించారు.ఓటరు జాబితాలో అవకతకవలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా అరాచకాలు జరుగుతున్నాయని.. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ప్రజల్లో తిరుగుబాటు చూసే నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర జరుగుతోందని.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.ఎన్నికల విధులకు అనుభవం ఉన్నవారిని నియమించాలని కోరామన్నారు. అలాగే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం అధికారుల్ని కోరినట్లు తెలిపారు. పోలీసులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. దొంగ ఓట్లపై ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న విషయాన్ని ఈసీకి వివరించినట్లు వెల్లడించారు.

KA Paul and pawan kalyan met in office
KA Paul

రీసెంట్‌గా గన్నవరం ఎయిర్‌పోర్టులో పవన్ కు ఆయ‌న అభిమానులు ఘ‌న‌ స్వాగతం పలికారు. ఈరోజు, రేపు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలతో చర్చించనున్నారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుపై, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సీఈసీ రాజీవ్ కుమార్ ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో మంత్రి రోజా అసలు వారు ఏపీలో ఎన్నికల కమీషన్ ను కలిసే రైటే లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ పొలిటిషన్స్ అని రోజా మండిపడ్డారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago