TDP Song : ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారాలు చేసుకుంటున్నారు.టీడీపీ, జనసేన పార్టీలు కలసికట్టుగా కదం తొక్కుతున్నాయి. రా కదలి రా పేరిట అప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తుండగా… తాజాగా భాగస్వామ్య స్ఫూర్తితో ఎలక్షన్ స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో “నినదించర గళం విప్పి, నిలదీయర గల్ల పట్టి… నిలవాలిర పిడికిలెత్తి… తెలుగుదేశ సైనికా…! ప్రతి అడుగొక పిడుగులాగ… గెలుపు మోకరిల్లే దాక… ప్రతినబూని కదలి రారా… జనసేన సేవకా…! అభివృద్ధికి అర్థమైన దార్శనికుని (చంద్రబాబు) స్ఫూర్తిగా… రాష్ట్ర ప్రగతే ముఖ్యమన్న పవనన్నకి అండగా…ఉడుకెత్తిన నెత్తురే ఒకనిప్పుటేరు (లోకేశ్) లాగ… కదిలిరా… కదలిరా… కదలిరా… పిలుస్తోంది పిలుస్తోంది తెలుగుదేశం రారా పదం కలిపి నడుస్తోన్న జనసేనతో రారా…” అంటూ ఈ గీతం సాగింది.
ఇక తాజాగా మరో సాంగ్ కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. పేదోడికి ధైర్యాన్ని పెంచిన జెండా.. పెద్దాయన మనకిచ్చిన పసుపిచ్చిన జెండా… చంద్రన్నేమన అందరి అండదండ.. చైతన్యం లోకేషుడు మన గుండెల నిండా అంటూ ఈ పాట సాగింది. రిలీజైన ఒక్క పూటలోనే టీడీపీ మాస్ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. తెలుగు తమ్ముళ్లకి ఈ పాట తెగ బూస్టప్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకి ఫిదా అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సారి ఎలా అయిన కూడా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. జనసేనతో పొత్తు పెట్టుకొని ప్రచారంలో ముందుకు సాగుతుంది.
చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత ప్రభుత్వం మరింత నియంతలా వ్యవహరిస్తోందనే నినాదాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తున్నారు. టీడీపీ ప్రయత్నాలు ఈ సారి బాగా వర్కవుట్ అవుతున్నాయని కొందరు చెప్పుకొస్తున్నారు. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా పాజిటివ్‌గానే ఉందని, ఈ సారి చంద్రబాబు సీఎం కావడం ఖాయమని కూడా కొందరు అంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…