KA Paul : వచ్చే ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత, ఓటర్ల జాబితాపై విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ సమీక్షించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటుగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఆప్ నేతలు హాజరయ్యారు. కేఏ పాల్ సైతం ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తుండగా, పవన్ కళ్యాణ్ కి ఆయన ఒక్కసారిగా ఎదురు పడ్డారు. ఇక పాల్‌ని చూడగానే పవన్ కళ్యాణ్ తెగ నవ్వేసుకున్నారట.
ఇక ఇదిలా ఉంటే సమావేశానికి ముందు చంద్రబాబు, పవన్ నోవాటెల్‌లో భేటీ అయ్యారు. ఈసీకి నివేదించాల్సిన అంశాలపై వీరిద్దరూ చర్చించారు.ఓటరు జాబితాలో అవకతకవలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా అరాచకాలు జరుగుతున్నాయని.. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ప్రజల్లో తిరుగుబాటు చూసే నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర జరుగుతోందని.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.ఎన్నికల విధులకు అనుభవం ఉన్నవారిని నియమించాలని కోరామన్నారు. అలాగే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం అధికారుల్ని కోరినట్లు తెలిపారు. పోలీసులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. దొంగ ఓట్లపై ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న విషయాన్ని ఈసీకి వివరించినట్లు వెల్లడించారు.
రీసెంట్‌గా గన్నవరం ఎయిర్‌పోర్టులో పవన్ కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు, రేపు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలతో చర్చించనున్నారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుపై, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సీఈసీ రాజీవ్ కుమార్ ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో మంత్రి రోజా అసలు వారు ఏపీలో ఎన్నికల కమీషన్ ను కలిసే రైటే లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ పొలిటిషన్స్ అని రోజా మండిపడ్డారు.