Jr NTR : ఇటీవల హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కడం, కొద్ది రోజులకే పిల్లల్ని కనడం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార పండంటి కవలలకు జన్మ ఇచ్చిన విషయం విదితమే. సరోగసీ ద్వారా నయనతారకు కవలలు కలిగారు. ఈ విషయాన్ని నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విగ్నేశ్ శివన్ వెల్లడించారు. కాగా తమ కుమారుల పేర్లను ఉయిర్, ఉలగమ్ అని పేర్కొన్నారు. నయనతార, తాను అమ్మానాన్నలమయ్యామని విగ్నేశ్ శివన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
నయన్ విగ్నేశ్‌కు పెళ్లి జూన్ 9న జరిగింది. అప్పుడే పిల్లలు ఎలా పుడతారని అందరిలో సందేహం ఉంది. పెళ్లికి ముందే పిల్లలకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. అందుకే పెళ్లిని హడావిడిగా కానిచ్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సరోగసీ ద్వారా పిల్లల్ని కన్న సెలెబ్రిటీల లిస్టులో నయన్ కూడా చేరినట్టు అయింది. నయనతారకు కవల పిల్లలు పుడతారన్న విషయాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పేశారని.. నయనతారకు కవలలు పుడతారని ఎన్టీఆర్‌కి ఎలా తెలుసు అని అందరిలో సందేహాలు తలెత్తుతున్నాయి.
అయితే అసలు విషయం ఏంటంటే.. 2010లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్, నయనతార, షీలా కౌర్ హీరో హీరోయిన్లుగా అదుర్స్ అనే సినిమా వచ్చింది. అందులో చారి పాత్రధారికి జతగా చంద్రకళ పాత్రలో నయనతార నటించింది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్.. నయనతారకు కవల పిల్లలు పుడతారని చెప్తారు. చంద్రకళ ఎడమ నడుము మడతలో పుట్టుమచ్చ ఉందని.. అందుకే ఆమెకు కవలలు పుడతారని చారి చెప్తాడు. అప్పుడు చెప్పిన ఆ విషయం ఇప్పుడు నిజమైందని నెటిజన్లు గుర్తుచేస్తూ ఈ విషయన్ని తెగ వైరల్ చేస్తున్నారు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న నయనతార, విగ్నేశ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న పెళ్లితో ఒక్కటవ్వడం, ఆ తర్వాత విహార యాత్రలకు వెళ్లడం ఇక ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడం జరుగుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…