Richa Gangopadhyay : రిచా గంగోపాధ్యాయ్.. ఈ అమ్మడు ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులని తెగ అలరించింది. రవితేజ మిరపకాయ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ రిచా గంగోపాధ్యాయ. లీడర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఆమెకు మంచి గుర్తింపు అందించింది మాత్రం మిరపకాయ్ సినిమా అనే చెప్పాలి.. హరిష్ శంకర్, రవితేజ కలయికలో వచ్చిన సినిమాలో ఆమె ట్రెడిషనల్ అమ్మాయిగా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. న్యూఢిల్లీకి చెందిన ఈమె ఉన్నత చదువుల కోసం ఆ తర్వాత అమెరికా వెళ్ళి అక్కడి వాతావరణంకు బాగా కనెక్ట్ అయింది.
యూఎస్ఏ లో ఉన్నప్పుడే మిస్ ఇండియాకి కూడా పోటీ చేసింది. 2007లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం కూడా సొంతం చేసుకుంది. అయితే మొదట్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీ పైనే ఫోకస్ చేసింది. 2010లో రానా దగ్గుపాటి మొదటి సినిమా లీడర్ సినిమాతో మొదటిసారి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఓ సమస్య రిచాని మరీ ఇబ్బంది పెట్టిందట. ఒక సినిమా చేయాలంటే కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాలి. అలాంటి విషయాలలో రిచా గంగోపాధ్యాయ చాలా బాధపడిందట. ఈ క్రమంలోనే నాగార్జున సరసన నటించిన భాయ్ సినిమా తర్వాత సర్దేసుకొని అమెరికాకి వెళ్లిపోయింది.
2019లో పెళ్లి చేసుకున్న రిచా ఇప్పుడు ఓ బిడ్డకి తల్లిగా ఆనందకరమైన జీవితం గడుపుతోంది. మొదటి సినిమా అనంతరం రిచా గంగోపాధ్యాయ త్వరగానే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంది. నాగవల్లి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మిరపకాయ్ సినిమా మంచి హిట్ అయింది. అనంతరం ఆమెకు తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. ఇక మరోసారి రవితేజతో సారొచ్చారు అనే సినిమా చేసింది. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. రిచా 2021లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ నెటిజన్స్‌ని అలరిస్తూ ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…