Ankitha : సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత ఫ్రీడమ్ హీరోయిన్లకు ఉండదు. వాళ్ళు 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా హీరోయిన్ల వెనుక పడతారు.. రొమాంటిక్ డ్యుయేట్స్ పాడుకుంటారు. కానీ హీరోయిన్లకు అంత ఛాన్స్ ఉండదు. వాళ్లకు 40 ఏళ్ళు దాటితే చాలు ఆంటీ పాత్రలు పలకరిస్తూ ఉంటాయి. అప్పటి వరకు హీరోయిన్‌గా నటించిన వాళ్లు.. ఆంటీ పాత్రలు చేయలేక పక్కకు తప్పుకుంటారు. తమ ఇమేజ్ ఎప్పుడూ హీరోయిన్ మాదిరే ఉండాలని సైడ్ క్యారెక్టర్స్ చేయరు. అలా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న ఒక హీరోయిన్ అంకిత. ఈమె ప్రస్తుతం ఎక్కడ ఉంది.. ఏం చేస్తుంది అనేది చాలా మంది అభిమానులకు తెలియదు.
మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు వచ్చారు. అలా దూసుకొచ్చిన ఒక ముద్దుగుమ్మ పేరు అంకిత. రస్నా యాడ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. హరికృష్ణ హీరోగా వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అంకితకు వరుస అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా నటించింది అంకిత. ఈ సినిమా సంచలన విజయం తర్వాత ఈమె పేరు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. అదే ఊపులో మరికొన్ని సినిమాలు కూడా చేసింది. బాలకృష్ణ విజయేంద్రవర్మ, శివాజీ స్టేట్ రౌడీ, వినాయకుడు, సీతారాముడు లాంటి సినిమాలలో నటించింది.
అన్ని సినిమాల్లో అదిరిపోయేలా గ్లామర్ షో చేసింది. అయితే విజయాల వేటలో వెనుక పడిపోవడంతో ఈమెకు అవకాశాలు కూడా తగ్గాయి. ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పూణేకు చెందిన విశాల్ ఝాటక్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో బీజీ అయిపోయింది. అంతే కాకుండా అంకిత వజ్రాల వ్యాపారం చేస్తోంది. తన తండ్రికి చెందిన ఈ వ్యాపారాన్ని ప్రస్తుతం అంకిత లీడ్ చేస్తోంది. ఈ ఫ్యామిలీ అమెరికాలో సెటిల్ అయిపోయింది. మళ్ళీ ఈమెకు సినిమాల్లో నటించే ఉద్దేశం కూడా లేదు. చివరగా గోపీచంద్ హీరోగా వచ్చిన రారాజు సినిమాలో కనిపించింది అంకిత.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…