Anushka Shetty : టాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న వారిలో పవన్ కళ్యాణ్, అనుష్క తప్పక ఉంటారు. అనుష్క శెట్టి బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన అనుష్క.. గత కొంతకాలం నుంచి సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. వరస ఆఫర్లు తలుపు తడుతున్నా ఆమె మాత్రం సినిమాల ఎంపికలో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తోంది. బాహుబలి తర్వాత అప్పుడప్పుడు మాత్రమే సందడి చేస్తుంది. అయితే ఈ అమ్మడు పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే ఛాన్స్ వచ్చినా కూడా మిస్ చేసుకుంది.
అగ్ర హీరోల అందరి సరసన ఆడిపాడిన అనుష్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే వీరిద్దరి కాంబోలో రెండు చిత్రాలు రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల అవి మిస్ అయ్యాయి. ఆ చిత్రాలు ఏంటన్నది చూస్తే… పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సుస్వాగతం ఒకటి. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రమిది. పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించారు. ఇందులో అనుష్కని ముందుగా కథానాయికగా తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆమె పలు కారణాల వలన తప్పుకుంది.
ఇక భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ అన్నవరం అనే సినిమా చేశాడు. ఈ సినిమా సైతం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో కూడా మొదట పవన్ కు జోడీగా అనుష్కను తీసుకోవాలని అనుకున్నా కూడా ఎందుకో ఈ కాంబో కుదరలేదు. ఆమె స్థానంలో ఆసిన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. మొత్తానికి పవన్ సరసన రెండు సార్లు ఛాన్స్ అందుకున్నా కూడా ఎందుకో వదిలేసుకుంది. ఇక పవన్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. సినిమాలు కాస్త తగ్గించే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…