Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ దంపతులు అందరికీ షాకిచ్చారు. విగ్నేష్ శివన్ తన సోషల్ ఖాతాల్లో తమకు కవల అబ్బాయిలు జన్మించారని పోస్ట్ పెట్టాడు. దీంతో అందరికీ ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. వీళ్లకు పెళ్లి అయ్యి 4 నెలలే అవుతోంది. జూన్ 9న వివాహం చేసుకున్నారు. ఇంతలోనే పిల్లలు ఎలా పుట్టారు.. అని తీవ్రంగా చర్చ నడుస్తోంది. అయితే వీరు పెళ్లికి ముందు సరోగసీ ప్లాన్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇప్పుడు పిల్లలు పుట్టారు. అయితే ఇలా సడెన్‌గా వీరు ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నయన్, విగ్నేష్ లు ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వీరు గతంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నయన్ జాతకంలో దోషం ఉందని.. కనుకనే వీరు పూజలు చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు తెర దించుతూ వీరు ఎట్టకేలకు మొన్నీ మధ్యే వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరు పలు దేశాలకు రెండు సార్లు హనీమూన్‌కు కూడా వెళ్లివచ్చారు. అయితే పెళ్లి కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన నయనతార ఇప్పుడు మళ్లీ షూటింగ్‌లలో పాల్గొంటోంది. కానీ నయన్ దంపతులు పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారని, కనుక ఆమె సినిమాలకు విరామం ఇస్తుందనే వార్తలు ఇటీవల బాగా ప్రచారం అయ్యాయి.
కానీ ఇలా నయన్ దంపతులు మాత్రం ఊహించని సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో అందరూ షాకవుతున్నారు. పిల్లల్ని ఇలా కూడా కనొచ్చా.. అని ఆశ్చర్యపోతున్నారు. వారు సినిమా షూటింగ్ ల వల్ల బిజీగా ఉండడంతోపాటు పిల్లల్ని కనే ప్రోగ్రామ్ పెట్టుకుంటే కెరీర్‌కు ఆటంకం కలుగుతుందని భావించే ఇలా సరోగసీని ఆశ్రయించారని తెలుస్తోంది. ఇక పెళ్లయిన నాలుగు నెలలకు వీరు తల్లిదండ్రులు అయి రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో విగ్నేష్ శివన్ స్పందిస్తూ.. తమలాగే తమ పిల్లలకు కూడా ఆశీర్వాదాలు అందించాలని తన పోస్టులలో కోరాడు. ఏది ఏమైనా ఇప్పుడీ విషయం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…