Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ప్రస్తుతం ఇటు తెలుగు, అటు హిందీ భాషలో కూడా సినిమాలు చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర: పార్ట్ 1 షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇటీవల తన తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలసి ఎన్టీఆర్ నటిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్లారు. ఈ డిన్నర్ డేట్‌లో రణబీర్-అలియా భట్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్‌లతో కలిసి ఎన్టీఆర్ సతీసమేతంగా సందడి చేశారు. సాధారణంగా ముంబైలో నైటౌట్లు, పార్టీలు కామనే.
అయితే హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా వరకూ ఇలాంటి వాటికి దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ముంబై వెళ్లిన తర్వాత వాటికి అలవాటు పడ్డట్లున్నాడు. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 28) రాత్రి బాలీవుడ్ స్టార్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, కరణ్ జోహార్ లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్, అతని భార్య లక్ష్మి ప్రణతి డిన్నర్ కు వెళ్లారు. ఈ అరుదైన ఫొటోల కోసం అక్కడి ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఈ డిన్నర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, ఆలియా, రణ్‌బీర్, కరణ్ జోహార్ కలిసి వచ్చారు. ఆ తర్వాత హృతిక్ రోషన్, సబా ఆజాద్ వాళ్లతో చేరారు. వార్ 2 మూవీలో హృతిక్ తో కలిసే తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
దీంతో అటు బ్రహ్మాస్త్ర, ఇటు వార్ 2 మూవీ టీమ్స్ కలయికగా ఈ డిన్నర్ సాగింది. ప్రస్తుతం వార్ 2 మూవీ షూటింగ్ ముంబైలోనే కొనసాగుతోంది. ఈ షూటింగ్ కోసమే కొన్నాళ్ల కిందట తారక్ అక్కడికి వెళ్లాడు. ఇప్పుడీ టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల కలయికకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక వార్ 2 సినిమాని 2025 ఆగష్టు 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌కి ఇదే తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్‌గా ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు. అయితే తన లుక్‌ను సీక్రెట్‌గా ఉంచేందుకు ఎన్టీఆర్ తెగ కష్టపడుతున్నారు. అందుకే ఇటీవల మీడియా ఫొటోలు తీస్తుంటే ఎన్టీఆర్ సీరియస్ కూడా అయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…