Pawan Kalyan : ఎలా ఉన్నావ్ రాపాక అంటూ నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan : ప్ర‌స్తుతం ఏపీలో ఎల‌క్షన్స్ ప్ర‌చారం ఓ రేంజ్‌లో సాగుతుంది. ఒకరిపై ఒక‌రు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం నాడు రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని జోస్యం చెప్పారు.అలానే రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో వారాహి విజయభేరి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, ఎమ్మెల్యే రాపాక అవినీతి అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

పేదలకు సెంటు ఇళ్ల పట్టాల విషయంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, అందులో రాపాకకు కూడా చిన్నపాటి వాటా ఉందని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టలేని ఈ ఎమ్మెల్యే మలికిపురం మండలం కత్తిమండలంలో ఐదు ఎకరాల్లో భవనం కట్టుకున్నాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. మన ఓట్లపై గెలిచి ప్రజలకు ద్రోహం చేశాడని మండిపడ్డారు. ఇసుకను బెదిరించి తీసుకున్నారని, ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్నారని ఆరోపించారు. ప్రైవేటు స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి రాజోలు ఎమ్మెల్యే అంటూ పవన్ ధ్వజమెత్తారు. అంతర్వేదిలో రథం కాలిపోతే ఇప్పటివరకు దానిపై ఒక్క కూడా మాట్లాడలేదని అన్నారు.

Pawan Kalyan satirical comments on rapaka
Pawan Kalyan

సఖినేటిపల్లిలో ఫైర్ స్టేషన్ కావాలని 2019లో అడిగిన రాపాక, జగన్ పంచన చేరేసరికి ఆ విషయం మర్చిపోయారు అంటూ విమర్శించారు. మలికిపురంలో దాతలు ఇచ్చిన భూములతో ఓ కాలేజీ ఉందని, దానిపై అధికార వైసీపీ నేతల కన్ను పడిందని అన్నారు. ఆ భూముల విలువ రూ.500 కోట్లు అని, అందుకే ఒక్కొక్క లెక్చరర్ ను బదిలీ చేసి బలవంతంగా పంపించేసి భూములను దోచేసే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నా… మరో 18 రోజుల తర్వాత మేం గెలుస్తున్నాం… ఒక్కొక్క అవినీతిపరుడ్ని మేం బయటికి లాక్కొచ్చి జరిమానా కట్టేలా చేస్తాం అంటూ ప‌వ‌న్ హెచ్చ‌రించారు.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

11 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 days ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 days ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

5 days ago