Chiranjeevi : ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అంటే సరిగ్గా 15 రోజుల టైమ్ మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అధికార వైసీపీ.. టీడీపీ కూటమి మధ్య మాటల తూటాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి.. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ జోరుగా ప్రచారం చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డిని పదవి నుంచి దించుతామంటూ కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తుంది. ఇక పిఠాపురంలో పలువురు సెలబ్రెటీలు పవన్ తరఫున ప్రచారం చేస్తున్నారు.
ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ప్రచారం నిర్వహించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా జనసేన కోసం ప్రచారం చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మెగా అభిమానులు మరింత మంది స్టార్ హీరోలు మెగా కుటుంబం నుంచి వస్తారని చూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులు కితం నుంచి పవన్ అన్నయ్య టాలీవుడ్ మెగాస్టార్ కూడా రాబోతున్నారు అని పలు రూమర్స్ వచ్చాయి. అయితే వీటిపై లేటెస్ట్ గా మరో అన్నయ్య నాగబాబు క్లారిటీ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు అయితే వస్తారని కానీ అన్నయ్య చిరు వస్తారో లేదో ఇంకా తెలీదని తెలిపారు. ప్రస్తుతం చిరు “విశ్వంభర” షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరు రావచ్చు రాకపోవచ్చు అనే హింట్ ని అయితే నాగబాబు అందించారు.
అయితే పృథ్వీ మాత్రం చిరంజీవి వస్తున్నట్టు కామెంట్ చేశారు. 5వ తేదీన మెగాస్టార్ ప్రచారానికి వస్తున్నారు.. దుమ్ముదులిపేస్తారు. చిరంజీవి గారు ఇక్కడ అద్భుతమైన పరిపాలన రావాలి. కూటమి అభ్యర్థులు గెలవాలి అని చెప్పి ఆయన షూటంగ్ కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ నా తమ్ముడు.. జనసేన నా తమ్ముడి పార్టీ.. నా గుండెల్లో తమ్ముడు ఉంటాడు.. ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు అని చెప్పిన వ్యక్తి మెగాస్టార్. ఆయన మే 5 నుంచి మే 11 వరకూ ఎడతెరగని బహిరంగ సభలు నిర్వహిస్తారు. చూసుకోండి ఒక పక్క చంద్రబాబు నాయుడు.. మధ్యలో చిరంజీవి గారు.. అటు పక్కన పవన్ కళ్యాణ్.. అసలు ఆ సభ చూస్తుంటేనే జనాలు ఓట్లు గుద్దేస్తారు.” అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…