Balakrishna : 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి మంచి కాక పుట్టిస్తున్నాయి. ఒకవైపు అధికార వైసీపీకి, విపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మధ్య గట్టి ఫైట్ అయితే నడుస్తుంది. మరోసారి అధికారాన్ని అందుకోవాలని జగన్, ఈసారి పవర్ చేజిక్కకుంటే ఉనికికే ప్రమాదమని టీడీపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జగన్ ఒంటరిగా బరిలో దిగితే.. చంద్రబాబు మాత్రం జనసేన, బీజేపీలతో కలిసి వైసీపీని తొక్కేయాలని చూస్తున్నారు. తన కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధించాలనే కసితో వున్నారు నందమూరి బాలకృష్ణ. హిందూపురంలో పనులు చూసుకుంటనే రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు.
జగన్ తన కంటే పెద్ద నటుడు అంటూ నటసింహం సెటైర్లు వేశారు. ఒక్క ఛాన్స్, కోడికత్తి, మొన్నామధ్య గులకరాయి అంటూ ఇటీవల పరిణామాలను ఎత్తిచూపారు.తాను నటిస్తే.. జగన్ జీవిస్తారని, రీల్ లైఫ్‌లోనైనా రియల్ లైఫ్‌లోనైనా బాలకృష్ణ ఒకలాగే వుంటాడని చెప్పుకొచ్చారు. ఆస్కార్లు, పద్మశ్రీలు జగన్ ముందు దిగతుడుపేనని.. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ రాష్ట్రాన్ని రావణ కష్టంలా మార్చారని ఎద్దేవా చేశారు. జగనన్నను అంటూ జలగలా పీడిస్తున్నారని.. మావయ్యనంటూ మనోభావాలు దెబ్బతీస్తున్నారని బాలయ్య పంచ్‌లు విసిరారు.అయితే స్వర్ణాంధ్ర సాకర బస్సు యాత్రలో భాగంగా శ్రీకాళహస్తిలో బాలయ్య చేసిన స్టంట్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
బొజ్జల సుధీర్ రెడ్డి తరపున ప్రచారానికి వెళ్లిన బాలయ్య ఒక బస్సు నుండి మరో బస్సుపైకి జంప్ చేశారు. అసలు కుర్రాళ్లకే సాధ్యం కాని ఆ జంప్‌ని చాలా సులువుగా బాలయ్య చేశాడు. వామ్మో 63 ఏళ్ల బాలయ్య చేసిన ఈ స్టంట్ అక్కడ అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వయస్సులో ఇంత ఉత్సాహంగా ఉన్నావేంటయ్యా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర దూసుకుపోతుంది.. బాలయ్య అన్ స్టాపబుల్ అంటూ బస్సుపై ప్రత్యేక క్యాప్షన్ కూడా ఇచ్చారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి లోగోను ముద్రించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…