Jabardasth Sowmya Rao : అనసూయ స్థానంలో జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉండగా ఎట్టకేలకు సౌమ్య రావు అనే కొత్త యాంకర్ తెరమీదకు వచ్చింది. కొత్త యాంకర్‌పై వచ్చి రాగానే హైపర్ ఆది పంచులు విసిరాడు. కృష్ణ భగవాన్ కూడా ఆమెపై పంచులేయడం.. దానికి ఆమె రివర్స్ కౌంటర్లు ఇవ్వడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. సౌమ్య రావు.. బెంగళూరులో చదువు పూర్తి కాగానే ఓ కన్నడ న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసింది. ఆ తర్వాత మోడల్‌గానూ రాణించింది. నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించి.. పట్టేదారి ప్రతిభ అనే కన్నడ సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది.
ఆ సీరియల్ హిట్ కావడం.. తన నటనకు మంచి గుర్తింపు లభించడంతో తమిళ టీవీ సీరియల్స్‌లోనూ అవకాశాలు వచ్చాయి. తెలుగులోనూ ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్‌లో నటిస్తూ తెలుగు వారికి బాగా దగ్గరైంది. అందం, అభినయంతో సీరియల్స్‌లో అదరగొడుతున్న ఈ నటి.. యాంకర్‌గానూ మెప్పిస్తోంది. వచ్చినప్పట్నుంచి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇప్పటికే 2 ఎపిసోడ్స్ లో సందడి చేసింది సౌమ్య రావు. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆమెకి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇందులో ఆమె తెర వెనుక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది. తాను అనాథని అని చెప్పడం షాక్ కి గురి చేస్తుంది. షోలో మీ గురించి ఏదైనా చెప్పండి అని యాంకర్ ప్రదీప్ అడగ్గా తాను తన లైఫ్ గురించి చెప్పనని పేర్కొంది. కానీ తనొక అనాథని పేర్కొంది. నా లైఫ్ గురించి చెప్పను నాకు అమ్మలేదు. నాన్న ఉండి కూడా లేడు. ప్రస్తుతం నేను ఓ అనాథని, నాకు ఎవరూ లేరు. ఇక్కడున్న వారందరికీ అమ్మనో, నాన్ననో, బ్రదరో, సిస్టరో ఎవరో ఒక్కరైనా ఉంటారు. కానీ నాకు ఎవరూ లేరు. ఇలాంటి ఫ్యామిలీ దొరికినప్పుడు చాలా బాగా చూసుకుంటాను అని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టుకొని, అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది సౌమ్య రావు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…