Ghee Benefits : తెలుగు వారి భోజనంలో నెయ్యి లేకపోతే అది అసంపూర్ణమైన భోజనమే. మనం ఉదయం అల్పాహారంలో ఇడ్లీల దగ్గరి నుంచి మధ్యాహ్నం ముద్దపప్పులో, సాయంత్రం అల్పాహారాలలో ప్రతిపూట నెయ్యిని తినేందుకు ఇష్టపడతాం. ఈ సూపర్‌ఫుడ్ ఆహారం సువాసనను, రుచిని మరింత పెంచుతుంది. అంతేకాదు నెయ్యి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.ఈ శీతాకాలంలో నెయ్యిని ప్రతిరోజూ ఆహారంలో కలుపుకొని తినమని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. ఈ చల్లటి వాతావరణంలో నెయ్యి శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వెచ్చదనం: శీతాకాలంలో శరీరాలకు వెచ్చదనాన్ని అందించే గుణాలు నెయ్యిలో ఉన్నాయి. నెయ్యి తటస్థ రుచిని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని ఏ వంటకంలో వేసినా, ఆ వంటకం నాణ్యత, రుచి పెరుగుతుంది. అందుకే నెయ్యిని అన్నంలో, రోటీలలో, పప్పులో, పాయసంలో ఎందులోనైనా కలుపుకొని తినవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: నెయ్యిలోని పోషకాలలో గ్యాస్ట్రిక్ రసాలు కూడా ఉంటాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. సాధారణంగా గ్యాస్ట్రిక్ రసాల్లో ఆహారాన్ని సరళంగా మార్చే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి ఆహారాన్ని మృదువుగా మార్చి, ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. అందుకే భోజనంలో ఒక టీస్పూన్ నెయ్యి కలుపుకోవాలని సూచిస్తున్నారు.
జలుబు, దగ్గుకు ఔషధం: నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇది దగ్గు, జలుబు వంటి సీజనల్ అనారోగ్యాలకు చికిత్స చేయడంలో ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసి రెండు చుక్కలు నాసిక రంధ్రాలలో వేస్తే జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. చర్మానికి లోపలి నుండి తేమ: నెయ్యి ఒక సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. దీనిని చర్మానికి బాహ్యవైపు నుంచి అప్లై చేసినప్పటికీ, లోపలి నుంచి కూడా తేమగా ఉంచుతుంది. నెయ్యితో మీ చర్మం మృదువుగా, కోమలంగా మార్చుకోవచ్చు. మీ స్కాల్ప్ కూడా డ్రైగా ఉంటే నెయ్యిని తలకు కూడా అప్లై చేసుకోవచ్చు, వెంట్రుకలకు మంచి పోషణ అందిస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…