Rishabh Pant : న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆదివారం మౌంట్ మాంగనుయ్ లో మొదలైన రెండో మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఎడమచేతి వాటం బ్యాటర్లు, కీపర్లు అయిన ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ లను ఓపెనర్లుగా పంపించాడు. అయితే యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకట్టుకోగా.. సీనియర్ అయిన పంత్ మాత్రం నిరాశపరిచాడు. వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్ నుంచిసైతం విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ ఈ మ్యాచ్‌లో రాణిస్తాడని అందరూ భావించారు. కానీ పంత్ కొద్దికాలంగా పేలవ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తున్నాడు.
ఈ ఏడాది రిషబ్ పంత్ టెస్టులు మరియు వన్డే ఇంటర్నేషనల్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. కానీ టీ20ల్లో తన అద్భుతమైన పవర్-హిట్టింగ్ టెక్నిక్‌లతో ప్రభావం చూపలేకపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగన వరల్డ్ కప్ లోనూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. అయినా టీమిండియా సెలక్టర్లు పంత్ పై నమ్మకం ఉంచి న్యూజిలాండ్ పర్యటనలో టీ20, వన్డే జట్లకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పంత్ ను ఓపెనర్ గా పంపిస్తే రాణిస్తాడని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. వారి సూచనల మేరకే పంత్ ఓపెనర్ గా బరిలోకి దిగి విఫలమయ్యాడు.
తాజాగా జరిగే మ్యాచ్‌లో ఓపెనర్ గా బ్యాటింగ్ ప్రారంభించిన పంత్.. 13 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఫెర్గూసన్ బౌలింగ్ లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. పంత్ నిర్లక్ష్యపు ఆటతో తీరుతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలి, ఇలా ఆడుతుంటే టీమిండియా కెప్టెన్ చేయాలంటా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. పంత్ ఆటతీరు అంతర్జాతీయ ట్రయల్ మ్యాచ్ ఆడుతున్నట్లు ఉంది అంటూనే.. ఇలా అయితే ఇకముందు పంత్ టీమిండియా జట్టులో చూడటం కష్టమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక పంత్ అంటే పడనివారు తాజాగా అతని బ్యాటింగ్ తీరుపై విమర్శల డోస్ ను మరింత పెంచారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…