Rowdy Alludu : ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. ‘ఫలక్ నుమా దాస్’ చిత్రంతో డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొని ”దాస్ కా ధమ్కీ” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఏఎంబీ థియేటర్స్ లో విడుదలైన ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాకి విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, తరుణ్ భాస్కర్, శౌర్య, అక్షర గౌడ, అజయ్, హైపర్ ఆది, పృథ్వీరాజ్, కాదంబరి కిరణ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. లియాన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా మూవీ అని.. తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసిన వెంటనే ఎన్నో పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. ‘ధమ్కీ’ ట్రైలర్ ని బట్టి చూస్తే వెయిటర్ గా పని చేసే విశ్వక్ సేన్.. కొన్ని వేల కోట్లకు వారసుడైన మరో విశ్వక్ స్థానంలోకి వెళ్లడం.. విలన్స్ తో ఫైట్ చేసి కంపెనీని నిలబెట్టడం.. ఫ్యామిలీలో మళ్ళీ సంతోషాన్ని నింపడానికి ప్రయత్నాలు చేయడం వంటివి గతంలో గోపీచంద్ మరియు సంపత్ నంది కాంబినేషన్ లో ‘గౌతమ్ నంద’ అనే సినిమలో కనిపించింది.
మరికొందరు మాత్రం ఇది నాని హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన ‘జెంటిల్ మ్యాన్’ చిత్రాన్ని గుర్తు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ‘జెంటిల్ మ్యాన్’ సినిమాకి ‘ధమ్కీ’ కి కూడా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు’ మరియు ‘దొంగ మొగుడు’ చిత్రాలు కూడా ఇదే టెంప్లేట్ లో ఉంటాయనే కామెంట్స్ కూడా వచ్చాయి. రవితేజ నటించిన ‘దరువు’ సినిమా కూడా గుర్తుకు వస్తోందని కొందరు అంటే.. అప్పుడెప్పుడో ఎస్వీ కృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘అభిషేకం’ సినిమా ఇలానే ఉంటుందని మరికొందరు అంటున్నారు. డబుల్ రోల్ అనేది పక్కన పెడితే ‘అల వైకుంఠపురములో’ మరియు ‘అజ్ఞాతవాసి’ సినిమాలు కూడా జ్ఞప్తికి వస్తాయని క ఒందరు చెబుతున్నారు. మరి విశ్వక్ ఈ చిత్రంతో ఎలా అలరిస్తాడో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…