Jabardasth Naresh : జబర్ధస్త్ షో వలన చాలా మంది ఫేమస్ అయ్యారు. వారిలో నరేష్ ఒకడు. చూడ్డానికి పిచుక పిల్లలా కనిపిస్తాడు కాని అతని ఎనర్జీ, కామెడీ అదిరిపోతుంది. పొట్టి నరేష్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. తన లోపంతోనే సరదాగా కామెడీ చేస్తూ అందరిని నవ్వించడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు. అయితే చాలా మందికి నరేష్‌ని చూస్తే ఓ సందేహం తప్పక కలుగుతుంది. అతను చిన్న పిల్లవాడా లేకుంటే పెద్ద వాడైన కూడా లోపం వలన అలా కనిపిస్తున్నాడా అని ఆలోచనలో పడుతుంటారు.
ఇటీవల నరేష్ ఒక స్కిట్‌లో భాగంగా 22 సంవత్సరాలుగా తాను జిమ్ చేస్తున్నానంటూ తన వయస్సును చెప్పకనే చెప్పేశారు. జబర్దస్త్ నరేష్ వయస్సు అంత ఉంటుందా అనే సందేహం అందరిలో ఉన్నా అది నిజం. బుల్లెట్ భాస్కర్ టీమ్ ద్వారా వెలుగులోకి వచ్చిన నరేష్ ఇప్పుడు తన కామెడీతో ఎంతగానో అలరిస్తున్నాడు. ఈ షో ఆ షో అనేది కాకుండా అన్ని కామెడీ షోలలో తనదైన హాస్యం పంచుతూ అలరిస్తున్నాడు నరేష్. పలు ఈవెంట్లలో కూడా నరేష్ సందడి చూస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటుండటం గమనార్హం. ఈయన్ని అంతా ముద్దుగా పొట్టి నరేష్ అని పిలుస్తుంటారు.
డాన్సర్‌గా వచ్చిన నరేష్ ఇప్పుడు జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్ అయిపోయాడు. హైట్ తక్కువగా ఉన్నాడనే అవమానాలు పడినా.. ఇప్పుడు అదే హైట్ ఆయనకు అన్నం పెడుతుంది. ముఖ్యంగా తనదైన పంచ్ డైలాగులతో కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తుంటాడు నరేష్. స్క్రిప్ట్‌లో లేని పంచులు వేయడంలో మనోడు దిట్ట. మంచి ఇల్లు కట్టుకోవాలన్నది తన ఆశయమని చెప్పిన నరేష్ ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరికొన్ని షోలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఈ కమెడియన్ పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…