Dhoni : క్రికెట్ కి సంబంధించి మహేంద్రసింగ్ ధోనీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఎప్పటికీ ఆయన పేరు నిలిచి ఉంటుంది. క్రికెట్ నుండి రిటైర్ అయిన తరువాత ధోనీ చాలా వ్యాపారాలు మొదలు పెట్టడం జరిగింది. ఇతర బిజినెస్ లలో కూడా భాగస్వామిగా ఉన్నాడు. రెస్టారెంట్ లు, స్పోర్ట్స్ క్లబ్ లు , హోటళ్లు ఇలా వివిధ వ్యాపారాలు చేస్తున్నాడు. అయితే ధోనీ కొత్తగా సినిమా నిర్మాణంతో ఎంటర్ టెయిన్మెంట్ రంగంలో అడుగుపెట్టనున్నాడని తెలుస్తుంది. తమిళ,తెలుగు, మళయాల చిత్రాలు నిర్మించనున్నారని సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
అయితే ధోనీ బాలీవుడ్ లో కాకుండా దక్షిణాది సినిమాలతో నే తన సినీరంగ ప్రవేశం చేయడం ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. పెద్ద బడ్జెట్ లో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తాడని ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే వారు చెప్తున్నట్టుగా ధోనీ ఎంటర్ టెయిన్మెంట్ పేరుతో తమిళ సూపర్ స్టార్ విజయ్, మహేష్ బాబు లతో భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ సినిమాను తీయడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
మహేష్, విజయ్ లు దక్షిణాదిన స్టార్ డమ్ ఉన్న హీరోలు కావడంతో సినిమాకు చాలా క్రేజ్ వస్తందని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ధోనీ ఇంకా అతని టీమ్ వీళ్లిద్దరితో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు . అన్ని విషయాలు చర్చించిన తరువాత, త్వరలో వీరి నుండి అధికారిక ప్రకటన రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
అయితే దీనికి కనీసం సంవత్సరం పైగా పట్టొచ్చని అంటున్నారు. ప్రస్తుతం మహేష్, విజయ్ లు ఇద్దరు వారి వారి సినిమాలతో బిజీగా ఉండడంతో అవి పూర్తి అయిన తరువాత ధోని ఎంటర్ టెయిన్మెంట్ తీయబోయే సినిమాలో భాగస్వాములు అవుతారని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…