Venkatesh : టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. వెంకీ తెలుగు ప్రేక్షకులనే కాకుండా హిందీ ప్రేక్షకులని కూడా అలరించాడు. “అనారి” సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టిన వెంకటేష్ ఆ తర్వాత తర్వాత “తకదీర్ వాలా” సినిమాలో కూడా నటించారు. అయితే ఆ సినిమా తర్వాత వెంకటేష్ కేవలం తెలుగు సినిమాల పైన మాత్రమే దృష్టి పెట్టారు. చాలా వరకు వెంకటేష్ నటించిన తెలుగు సినిమాలు హిందీలో కూడా డబ్ అవడంతో వెంకీ కి బాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
అయితే వెంకటేష్ ప్రస్తుతం హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్ లో గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే వెంకటేష్ ఈ చిత్రంలో నటించడం పట్ల దగ్గుబాటి అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. మన సౌత్ చిత్రాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపిస్తున్నప్పుడు వెంకటేష్ వెళ్లి అక్కడ చిత్రంలో నటించాల్సిన అవసరం ఏముందని కొందరు వాపోతున్నారు.
ఎఫ్3 లాంటి చిత్రంతో వెంకటేష్ 60 కోట్ల షేర్ వసూలు చేశాడు. ఇప్పటికీ ఆయన చిత్రాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. ఇలాంటి సమయంలో కంటెంట్ లేని బాలీవుడ్ చిత్రాలు చేసే బదులు మంచి చిత్రాలను చేసి తన మార్కెట్‌ని పెంచుకోవాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు .మరి అభిమానుల కోరికని వెంకటేష్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ స్వయంగా వెంకటేష్ ను కలిసి ఈ సినిమా కోసం ఒప్పించినట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…