ISRO Chairman : విమానంలో ఇస్రో ఛైర్మ‌న్‌కి గ్రాండ్ వెల్క‌మ్‌.. క‌ర‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య‌..!

ISRO Chairman : కొద్ది రోజుల క్రితం చంద్ర‌యాన్ 3తో భార‌త్ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ విజ‌యంతో దేశ విదేశాల్లో భారత కీర్తి పతాక స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 సక్సెస్ వెనక ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్‌కు ఇండిగో విమానంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించండం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇండిగో విమానంలో పనిచేసే సిబ్బంది పూజా షా ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఇండిగో విమానంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ ప్రయాణిస్తున్నట్లు.. అందులో ప్రయాణిస్తున్న మిగితా ప్రయాణికులకు అనౌన్స్‌మెంట్ చేసింది.

విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ చప్పట్లతో సోమ్‌నాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతలోనే మరో ఫ్లైట్ అటెండెంట్ వచ్చి.. సోమ్‌నాథ్‌కు కొన్ని తినే పదార్థాలు అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇండిగో విమాన సిబ్బంది పూజా షా పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇండిగో విమానంలో సోమనాథ్‌కు సేవ చేసే అవకాశం లభించడం గొప్ప‌గా ఉందంటూ సంతోషం వ్య‌క్తం చేసింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కేవలం శాస్త్రవేత్తలే కాకుండా కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ISRO Chairman somanath got grand welcome in flight
ISRO Chairman

ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో ఇస్రో చరిత్ర సృష్టించింది. భారతదేశ ప్రతిష్టాత్మక చంద్ర మిషన్ స‌క్సెస్ వెనుక సోమనాథ్, పి వీరముత్తువేల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు, కల్పన కె డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. మొత్తానికి ఇండిగో విమానంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌కు స్వాగతం పలికిన వీడియో ప్రజల మనసులను గెలుచుకుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago