Siima Awards : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే ఈవెంట్ ‘సైమా’ అవార్డ్స్ సెప్టెంబర్ 15,16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్లు నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. వేడుకలో నిధి, మీనాక్షి ఇద్దరు కూడా తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. నిధి బ్లాక్ డ్రెస్‌లో హోయలు పోగా,మీనాక్షి రెడ్ కలర్ డ్రెస్‌లో తన ఎద అందాలన్నీ చూపిస్తూ అందరు మంత్ర ముగ్దులయ్యేలా చేసింది. మీనాక్షి అందాలు మాత్రం ప్రతి ఒక్కరి దృష్టిని ఎంతగానో ఆకర్షించాయి. ప్రస్తుతం నిధి, మీనాక్షిల పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
వేడుకలో రానా మాట్లాడుతూ.. ఈ వేడుకతో నాది 11 ఏళ్ల బంధం. గ్లోబల్ ప్లాట్‌ఫాంకి చేరువ అవడానికి సైమా గొప్ప వేదిక. ఇందులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.” అని రానా దగ్గుబాటి అన్నారు. ఇక దక్షిణాది సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి సైమాతో తనకు అనుబంధం ఉందని, లెజెండ్రీ కళాకారులతో కలిసి స్టేజ్ పంచుకునే అవకాశం రావడం నిజంగా అదృష్టమని నిధి అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ “సైమా అవార్డ్స్‌లో పాల్గొనడం నాకిదే ప్రథమం. సైమా కేవలం ఓ వేడుక కాదు. సినిమా వాళ్లకు ఓ పండుగ. ఈ పండుగలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో సైమా చైర్‌పర్సన్ బృందా ప్రసాద్, శశాంక్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు.
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్ సరిగ్గా పదకొండేళ్ల క్రితం 2012లో ప్రారంభమైంది. ప్రతి యేడాది దక్షిణ భారత దేశంలోని నాలుగు భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటోంది. 2022 యేడాదికి గాను సైమా దక్షిణాదికి చెందిన నాలుగు భాషలకు సంబంధించిన నామినేషన్స్‌ను ప్రకటించింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ దక్కించుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…