Roja : ఈ రోజు తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న అనంతంరం రోజా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 118 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు, లోకేష్‌పై సీబీఐ విచారణ జరిపించి..జైల్‌కు పంపించాలని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు చేసిన అవమానాలు ప్రధాని మోడీ, అమిత్‌షాను ఇంకా మర్చిపోలేదు..దానికి బదులు ఉంటుందని ఆమె అన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు చాలా దోచుకున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. తాజాగా, ఐటీ సోదాలతో చంద్రబాబు దోపిడీ బయటపడిందన్నారు.
రూ. 118 కోట్లు దోపిడీపై లెక్క చెప్పాలన్నారు. ఐటీని నేనే కనిపెట్టానంటూన్న చంద్రబాబు.. ఐటీ నోటీసులపై స్పందించాలని డిమాండ్ చేశారు. దొంగ సంస్థలు ఏర్పాటు చేసి దోచుకున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు రోజా. చంద్రబాబు దోచుకున్న సొమ్ముని బ్రాహ్మణి, భువనేశ్వరి లెక్కపెట్టారంటూ వారిపై కూడా ఆరోపణలు చేసింది రోజా.పాదయాత్ర చేస్తూ లోకేష్ ఇష్టమొచ్చినట్లు మొరుగుతున్నారని రోజా మండిపడ్డారు. పవన్ కళ్యాన్ షూటింగ్ గ్యాప్ లో చంద్రబాబు ప్యాకేజీని తీసుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు.
అమరావతిలో అక్రమాలకు పాల్పడిన డబ్బులను బ్రాహ్మణి, భువనేశ్వరి లెక్కలు పెట్టారని.. చంద్రబాబు, లోకేష్‌ను విచారించి అరెస్ట్ చేయాలన్నారు. రజనీకాంత్‌ను తాము విమర్శించలేదన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పామన్నారు. చంద్రబాబును ఏపీని నెంబర్ వన్ స్థానానికి తీసుకొస్తారని రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను మాత్రమే వ్యతిరేకించామని మంత్రి రోజా అన్నారు. రజినీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు చేశారు. రజినీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారన్నారు. ఎన్టీఆర్ ఏమన్నారో.. రజినీకాంత్‌కు వీడియోలు పంపిస్తానని చెప్పారు. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రజినీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. అంతకన్నా ముందు తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…