Nara Lokesh : డేట్, టైం రాసుకోండి.. 100 రోజుల్లోనే అంటూ స‌వాల్ చేసిన.. నారా లోకేష్‌..

Nara Lokesh : నారా లోకేష్ యువగళం పాదయాత్ర స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతుంది.ఒక‌వైపు పాద‌యాత్ర చేస్తూ మ‌రోవైపు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి తెలుసుకుంటున్నారు. సోమ‌వారం రోజు ఉండి కోట్ల ఫంక్షన్ హాలులో ఆక్వా రైతులతో నారా లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను అక్వారైతులు లోకేష్‌కు వివరించారు. రైతులు వినతి పత్రం ఇచ్చారు.‘‘ ఫీడ్ రేటు పెరిగింది, కనీస మద్దతు ధర రాక ఆక్వా హాలిడే ఇచ్చే పరిస్థితి వచ్చింది.జగన్ పాలనలో విద్యుత్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. జగన్ రూ.1.50 విద్యుత్ అందజేస్తాం అని చెప్పి మోసం చేశాడు.యూనిట్‌కి రూ.3.50 వసూలు చేస్తున్నారు. ఆక్వా, నాన్ ఆక్వాజోన్ అని నిబంధనలు పెట్టారు.కోల్డ్ స్టోరేజ్‌లు లేక ఇబ్బంది పడుతున్నాం అని అన్నారు.

నెల్లూరులో ఆక్వా యూనివర్సిటీ ఉంది. అలాంటి యూనివర్సిటీ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పెట్టాలి. ప్రభుత్వ నియంత్రణ లేక సీడ్ క్వాలిటీ తగ్గి నష్టపోతున్నాం.భీమా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం.కౌంట్ విధానంతో రైతులు నష్టపోతున్నాం.టీడీపీ హయాంలో ట్రాన్సఫా‌ర్మర్లను సబ్సిడీలో ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ట్రాన్సఫా‌ర్మర్ల రేట్లు విపరీతంగా పెంచేసింది.జగన్ ప్రభుత్వంలో విద్యుత్ ధరలు విపరీతంగా పెంచి రైతులను దోచుకుంటున్నారు. ఖాళీ చెరువులకి కూడా వేలల్లో బిల్లులు వస్తున్నాయి అని వారు త‌మ బాధ‌ల‌ను విన్న‌వించుకుంటున్నారు.

Nara Lokesh challenges ysrcp leaders
Nara Lokesh

జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీడ్ , ఫీడ్, మందులు, మినరల్స్, విద్యుత్, ఏరియేటర్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ ఆక్వా లాబ్స్ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. పెట్టుబడి పెరిగింది కానీ రొయ్య రేటు పెరగడం లేదు. స్థానిక అమ్మకాలు పెంచితే కానీ రైతుకి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదు.చేపల చెరువు తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.విదేశీ మారకద్రవ్యం తీసుకొచ్చే ఆక్వారంగాన్ని జగన్ నిర్లక్ష్యం చేశారు అని రైతులు లోకేష్‌కు సమస్యలను విన్నవించారు.

దీనిపై మాట్లాడిన నారా లోకేష్‌.. జగరొనా వైరస్ వల్ల ఆక్వా రంగంపై ఆధారపడిన 10 లక్షల మంది రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్ అందించాం. వైసీపీ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. 16 నెలలు జైల్లో ఉన్నవాడి చేతికి తాళాలు ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ‘టీడీపీ అధికారంలోకి వస్తే…. కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం. ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం.ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తాం. మొదటి 100 రోజుల్లోనే 24 గంటల విద్యుత్ అందిస్తాం అని నారా లోకేష్ స్ప‌ష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago