CM YS Jagan : ఇటీవల ఏపీ సీఎం జగన్ పలు ప్రాంతాలలో సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే శనివారం రాత్రి 9.30 గంటలకు విజయవాడ నుంచి జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో లండన్ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్‌తోపాటు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తదితరులు వీడ్కోలు పలికారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లండన్‌కు సమీపంలో ఎస్సెక్స్ కౌంటీలోని స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలని కలిసేందుకు జగన్ దంపతులు లండన్ వెళ్లగా హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలతో సీఎం దంపతులు సరదాగా గడపనున్నారు. సీఎం జగన్ సెప్టెంబర్ 11న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
జగన్ పెద్ద కుమార్తె వైఎస్ హర్షారెడ్డికి మంచి అకాడమిక్ రికార్డ్ ఉంది. 2017లో ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చేరింది. ఎకనమిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె.. అమెరికాలోని ఓ ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌లో ఉద్యోగానికి కూడా ఎంపికైంది. కానీ ప్రపంచంలో టాప్-5 బిజినెస్ స్కూల్స్‌లో ఒకటిగా పేరొందిన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి ఆమె ఫైనాన్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. డిస్టింక్షన్లో పాసైన హర్షా రెడ్డి డీన్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. హర్షా రెడ్డి గ్రాడ్యుయేషన్ సందర్భంగా.. గత ఏడాది జులై 2న జగన్ దంపతులు పారిస్ వెళ్లారు. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ పూర్తయిన సందర్భంగా జగన్ ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు.
ఇక జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి విషయానికి వస్తే.. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. అంతకు ముందు ఆమె అమెరికాలో చదువుకుంది. జగన్ కుమార్తెలిద్దరూ ఇప్పటి వరకూ తమ జీవితాన్ని ప్రయివేట్‌గా గడిపేందుకే ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్దగా కనిపించరు. చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టిన వీరు మంచి చదువులు చదువుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…