ISRO Chairman : కొద్ది రోజుల క్రితం చంద్రయాన్ 3తో భారత్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో దేశ విదేశాల్లో భారత కీర్తి పతాక స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 సక్సెస్ వెనక ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్‌కు ఇండిగో విమానంలో ఘన స్వాగతం లభించండం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇండిగో విమానంలో పనిచేసే సిబ్బంది పూజా షా ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఇండిగో విమానంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ ప్రయాణిస్తున్నట్లు.. అందులో ప్రయాణిస్తున్న మిగితా ప్రయాణికులకు అనౌన్స్‌మెంట్ చేసింది.
విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ చప్పట్లతో సోమ్‌నాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతలోనే మరో ఫ్లైట్ అటెండెంట్ వచ్చి.. సోమ్‌నాథ్‌కు కొన్ని తినే పదార్థాలు అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇండిగో విమాన సిబ్బంది పూజా షా పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇండిగో విమానంలో సోమనాథ్‌కు సేవ చేసే అవకాశం లభించడం గొప్పగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కేవలం శాస్త్రవేత్తలే కాకుండా కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో ఇస్రో చరిత్ర సృష్టించింది. భారతదేశ ప్రతిష్టాత్మక చంద్ర మిషన్ సక్సెస్ వెనుక సోమనాథ్, పి వీరముత్తువేల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు, కల్పన కె డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. మొత్తానికి ఇండిగో విమానంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌కు స్వాగతం పలికిన వీడియో ప్రజల మనసులను గెలుచుకుంది.