IPL 2023 : ల‌క్నో, గుజ‌రాత్ ఐపీఎల్ మ్యాచ్ ఫిక్స్ అయిందా.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

IPL 2023 : క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అన్న‌ది కామ‌నే. ఒక‌ప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ బాగానే చేసేవారు. అయితే ఇప్పుడు ఇలాంటి వార్త‌లు రావ‌డం లేదు. కానీ తాజాగా జ‌రిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ చూస్తే మాత్రం క‌చ్చితంగా స‌గ‌టు ప్రేక్ష‌కుడికి ఆ మ్యాచ్ ఫిక్స్ అయింద‌నే అనుమానం క‌లుగుతుంది. శ‌నివారం ల‌క్నో వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జియాంట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌రిగిన ఐపీఎల్ 2023 టోర్నీ 30వ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ‌గా సాగింది. అయితే ల‌క్నో జోరు చూసి అంద‌రూ ఆ జ‌ట్టే గెలుస్తుందనుకున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత‌మైన ఆట తీరుతో దూసుకెళ్తూ చ‌క్క‌ని ర‌న్‌రేట్‌ను సైతం మెయింటెయిన్ చేశారు.

కానీ ఏం జ‌రిగిందో తెలియ‌దు. అనూహ్యంగా వికెట్లు వ‌రుస‌గా ప‌డ్డాయి. దీంతో మ్యాచ్ ల‌క్నో చేజారింది. అయితే అదేమీ భారీ స్కోరు కాదు. త‌క్కువ స్కోరే. పైగా ల‌క్నోకు వికెట్లు కూడా ఉన్నాయి. కానీ వ‌రుస బంతుల్లో వికెట్ల‌ను కోల్పోవ‌డం.. చివ‌రి 5 ఓవ‌ర్ల‌లో ఓవ‌ర్‌కు 3, 4 ప‌రుగులు అలా చేయ‌డంతో.. అంద‌రికీ డౌట్ వ‌స్తోంది. ల‌క్నో ప్లేయ‌ర్లు కావాల‌నే మ్యాచ్ ఓడిపోయార‌ని.. అస‌లు ఫిక్సింగ్ జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు. అందుక‌నే ల‌క్నో ఓడిపోయింద‌ని అంటున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో సైతం ఫిక్సింగ్ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

IPL 2023 lucknow vs gujarat match fixed netizen angry
IPL 2023

మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజ‌రాత్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 135 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అయితే ల‌క్నో ఈ ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక త‌డ‌బ‌డింది. 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 128 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఒక ద‌శ‌లో 36 బంతుల్లో 31 ప‌రుగులు మాత్ర‌మే సాధించాల్సి ఉంది. వికెట్లు కూడా చేతిలో ఉన్నాయి. కేఎల్ రాహుల్ క్రీజులోనే ఉన్నాడు. ఓపిగ్గా ఆడితే త‌ప్ప‌క గెలుస్తారు. గెలిచే అవ‌కాశం ల‌క్నోకే ఉంది. కానీ అనూహ్యంగా ల‌క్నో ప్లేయ‌ర్లు వికెట్ల‌ను కోల్పోయారు. ప‌రుగులు కూడా చేయ‌లేదు. ఇక్క‌డే ప్రేక్ష‌కుల‌కు అనుమానం వ‌స్తోంది. ఈ మ్యాచ్ ఫిక్స్ అయింద‌ని.. కేఎల్ రాహుల్‌, ల‌క్నో టీమ్ అమ్ముడుపోయార‌ని అంటున్నారు. ఇలాంటి స్క్రిప్టెడ్ మ్యాచ్‌ల‌ను చూడ‌డం అవ‌స‌ర‌మా.. అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై బీసీసీఐ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Share
editor

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago