Virupaksha Collections : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ చిత్రం విరూపాక్ష మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు పూర్తి మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించడంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని ఎంతగానో పెంచేశాయి. కాగా, రిలీజ్ రోజునే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు.విమర్శకుల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు నుంచే ‘విరూపాక్ష’ దుమ్మురేపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.12 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవ కలెక్షన్లు అంతగా లేవని ట్రేడ్ వర్గాల టాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.79 కోట్ల నెట్, 7.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా 11కోట్లు చేసిందట. ఏరియా వైజ్ గా కలెక్షన్ల వివరాలు చూస్తే.. నైజాం – రూ.1.82 కోట్లు, సీడెడ్ – రూ.54 లక్షలు, ఉత్తరాంద్ర – రూ.58 లక్షలు, ఈస్ట్ గోదావరి – రూ.40 లక్షలు, వెస్ట్ గోదావరి – రూ.47 లక్షలు, గుంటూరు – రూ. 46 లక్షలు, క్రిష్ణ – రూ.32 లక్షలు, నెల్లూరు – 20 లక్షలు , కర్టాటక, మిగితా ఏరియాలో – రూ.36 లక్షలు, ఓవర్సీస్ లో రూ.1.20 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది.
‘విజేత’ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో ‘విరూపాక్ష’ రెండో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. గతేడాది యాక్సిడెంట్ కావడంతో సాయిధరమ్ తేజ్ కొన్ని రోజుల పాటు సినిమాలకి దూరంగా ఉన్నాడు. కోలుకున్న తర్వాత ‘విరూపాక్ష’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కార్తీక్ వర్మ దండు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటించింది. సోనియా సింగ్ మరో లీడ్ క్యారెక్టర్ చేసింది. సాలిడ్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ మంచి జోష్‌లో ఉన్నాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…