Virupaksha : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా రీసెంట్‌గా విడుదలైన మంచి విజయం సాధించింది. కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ బివిఎస్ఎన్ ప్రసాద్ నియూర్మాతగా సుకుమార్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన విరూపాక్ష ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరిస్తూ ఉంది. విరూపాక్ష ఫాంటసీ చిత్రం కాగా, రుద్రవనం అనే పర్వత ప్రాంతంలో జరిగిన స్టోరీ ఇది. ఈ చిత్రం సంయుక్త మీనన్ కథానాయికగా నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానా దగ్గుబాటి కి జోడిగా పరిచయం అయిన సంయుక్త మీనన్ చాల త్వరగా తెలుగు ప్రేక్షకులకు దగ్గిరయింది. ఆ మధ్య వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార, ఈ మధ్యే వచ్చిన ధనుష్ సార్ చిత్రంలో ఆకట్టుకుని హిట్ చిత్రాల హీరోయిన్ గా దూసుకుపోతోంది.
అయితే ఈ సినిమా సినిమా చూసినవాళ్లందరికి విరూపాక్ష అర్ధం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. ఇటీవల మన తెలుగు చిత్రాలు చాలా కూడా చాలా మీనింగ్ ఉన్న అర్ధంతో టైటిల్ సెట్ చేసుకుంటున్నాయి. హిట్ కొట్టిన చిత్రాలు చూస్తే.. ‘బలగం’, ‘దసరా’ .. టైటిల్ కి సినిమాకు లింక్ ఉంటుంది. ఇప్పుడు ‘విరూపాక్ష’ కూడా ఆ లిస్టులోకి చేరింది. కాకపోతే సినిమా అంతా చూసినా సరే చాలామంది టైటిల్ మీనింగ్ ఏంటనేది అర్థం కాలేదు.. కాని పోస్టర్స్ ని గమనిస్తే అసలు విషయం ఏంటనేది తెలిసిపోతుంది. రూపంలేని కన్నుని ‘విరూపాక్ష’ (శివుడి మూడో కన్ను) అంటారట. ఈ మూవీలోనూ రూపంలేని శక్తితో హీరో పోరాటం చేస్తాడు కాబట్టి మూవీ ఈ టైటిల్ పెట్టినట్టు తెలుస్లుంది.
చేతబడి, తాంత్రిక విద్యల ఆధారంగా సినిమా తీసినప్పటికీ ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా చిత్రం తెరకెక్కించారు. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండుకి ఇది తొలి మూవీ అయినప్పటికీ, ప్రేక్షకుల్ని చివరివరకు ఎంతో థ్రిల్ చేశాడు. చిన్నచిన్న పొరపాట్లు తప్పితే.. ‘విరూపాక్ష’మాత్రం ప్రేక్షకులకి బాగానే ఎంటర్‌టైన్ చేసింది.ఈ సినిమా చూశాక చాలారోజుల తర్వాత ఓ మంచి హారర్ మూవీ చూశామని ప్రేక్షకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లే మూవీలో భయపెట్టే ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…