దక్షిణ భారతంలో ఎక్కువ శాతం ఇళ్లలో వరి అన్నం తినడం సాధారణం. ఏది తిన్నా ఒక్క ముద్దైనా అన్నం తినకపోతే ఆ పూటకి భోజనం చెయ్యనట్టే భావిస్తారు. రోజూ తెల్ల బియ్యం తింటే ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే బియ్యం మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిచదనే విషయం ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి. రోజూ అన్నం తినే వారిలో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా ఈ విషయాలపై శ్రద్ధ పెట్టడం అవసరం. వైట్ రైస్ తినడం వలన కలిగే నష్టాలేంటో చూద్దాం.
శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్‌లు సరిగా లేకుండా ఉన్న తెల్లటి అన్నాన్ని తినడం వలన ఎక్కువగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం వంటి సమస్యలు వేధిస్తాయి. బియ్యం పై పొరలో విటమిన్ ఇ అనేది ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా ఉండదు. లిసిధిన్ అనే పదార్థం తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్థం మనలో కొవ్వు, కొలెస్ట్రాల్ పదార్థాలు పేరుకోకుండా నివారించేందుకు కొవ్వుకు విరుగుడుగా పని చేస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి తెల్లటి బియ్యంలో ఉండదు. పీచుపదార్థాలన్నీ బియ్యం పై పొరలలో ఉండడం వల్ల, తెల్ల బియ్యంలో పీచు లేకపోవడంతో మలబద్ధకం వస్తుంది.
ఎన్ని మందులు వాడినా తగ్గదు. అలాగే బరువు పెరుగుతారు. తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండే సరికి, సరిగా పంటి కింద పడక, నమలకుండా తేలిగ్గా జారి గొంతులోకి వెళ్లిపోతుంటాయి. నమలనందున నోటిలో గానీ, పొట్టలో గానీ జీర్ణక్రియ సరిగా ఉండదు. శరీరానికి ఎక్కువ సేపు వరకూ, ఎక్కువ శక్తిని సమకూర్చలేదు. తిన్న 3, 4 గంటలలోనే నీరసం వచ్చేట్లుగా చేస్తుంది. కాళ్లకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పైగా తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలినిపించే విధంగా చప్పదనముంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…